Raw Onion: పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?

మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు. అంటే ఉల్లిపాయ వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని అర్థం. అలాంటి ఉల్లిపాయను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 24, 2024 / 12:29 PM IST

మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు. అంటే ఉల్లిపాయ వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని అర్థం. అలాంటి ఉల్లిపాయను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. ఉల్లిపాయ వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు వైద్యులు. కొందరు ఉల్లిపాయను వంటల్లో తినడానికి ఇష్టపడితే మరికొందరు నేరుగా పచ్చిగా కూడా తింటూ ఉంటారు. కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు ఎర్రగడ్డను మంచి కొన్ని తినడం అలవాటు. అయితే పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఉల్లిపాయలు ఎంతో బాగా సహాయపడతాయి. ఉల్లిపాయల్ని బిర్యానిలో, సలాడ్, మజ్జిగ వంటి ఎన్నో ఆహారాల్లో తింటుంటారు. అలాగే వేడి వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండటానికి పచ్చి ఉల్లిపాయల్ని తినమని సలహాలు కూడా ఇస్తుంటారు. పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే ఇది బాడీ హీట్ ను కూడా తగ్గిస్తుందట. అయితే పచ్చి ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని ఎక్కువగా తింటే మాత్రం మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందట. అవును పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయట. అలాగే కడుపుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.

పచ్చి ఉల్లిపాయలను లిమిట్ లో తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. కానీ వేసవిలో ఉల్లిపాయలను ఎక్కువగా తింటే మాత్రం ఎసిడిటీ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుందట. నిజానికి ముడి ఉల్లిపాయల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయట. అయితే మీకు అవసరమైన దానికంటే ఎక్కువ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ను తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదట. పచ్చి ఉల్లిపాయలు తింటే అజీర్ణం,అసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందట. రక్తంలో షుగర్ తక్కువగా ఉంటే ఉల్లిపాయలను తినక పోవడమే మంచిది అని చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట. ఒకవేళ డయాబెటిస్ పేషెంట్లు ఉల్లిపాయలు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను వెంటనే చెక్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయల్ని ఎక్కువగా తినడం వల్ల మలబద్దకం, కడుపు నొప్పి కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీటిని ఎక్కువగా తింటే కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయట.

note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.

Follow us