Site icon HashtagU Telugu

Green Chilli Water: పచ్చి మిరపకాయలను నానపెట్టి ఆ నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Green Chilli Water

Green Chilli Water

పచ్చి మిరపకాయ.. ఇది దాదాపుగా ప్రతీ ఒక్కరి వంట గదిలో తప్పనిసరిగా ఉంటుంది. పచ్చి మిరపకాయ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కారం. కొందరు వీటిని పచ్చిగా తింటే మరికొందరు కూరల్లో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని కూరల్లో ఉపయోగించడం వల్ల కూరకు రుచిని పెంచుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పచ్చి మిరపకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి6, ఐరన్, కాపర్, పొటాషియం లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

అయితే ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో పచ్చి మిరపకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయట. ఇదే పచ్చి మిరపకాయలను రాత్రిపూట నీటిలో నానపెట్టి ఆ వాటర్ ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ మేలు చేస్తాయట. పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీని ఫ్రీ రాడికల్స్, పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయట. అంతేకాదు గ్రీన్ చిల్లీలో విటమిన్ సి ఉంటుంది. బిటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఈ రెండూ మన రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయట.

ఈ వాటర్ తాగడం వల్ల మన చర్మం అందంగా మారడంతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుందట. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తాయట. డయాబెటిక్ పేషెంట్స్ కి అయితే ఈ వాటర్ దివ్య ఔషధంలా పని చేస్తాయట. ఈ గ్రీన్ చిల్లీ వాటర్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా పని చేస్తాయట. మన శరీరంలోని కొలిస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలోనూ సహాయం చేస్తాయట. అంతేకాదు ఈ నీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. కాబట్టి ఈజీగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందట. 3 లేదంటే నాలుగు గ్రీన్ చిల్లీ లను శుభ్రం చేయాలి. ఈ నీటిని మనం రాత్రిపూట ఒక గ్లాసులో నానపెట్టాలి. దాంట్లో చిటికెడు ఉప్పు వేయాలి. అలా వదిలేసి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఈ చిల్లీ వాటర్ తాగిన తర్వాత కాసేపటి వరకు ఏమీ తినకూడదట. తాగకూడదు. అరగంట తర్వాత ఏదైనా తినవచ్చని చెబుతున్నారు.