Site icon HashtagU Telugu

Sugar: ఏంటి చక్కెర తీసుకోవడం తగ్గిస్తే ఆ సమస్యలన్నీ దూరం అవుతాయా!

Sugar

Sugar

ప్రస్తుత రోజుల్లో చక్కెర వాడుకున్న ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. కాఫీ మొదలు స్వీట్ల తయారీ వరకు చాలా రకాలుగా మనం చక్కెరను ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా మార్కెట్లో దొరికే స్వీట్స్ చాలా వరకు ఈ చక్కెరతోనే తయారు చేస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మనం ఇంట్లో తయారు చేసుకునే చాలా రకాల స్వీట్లలో కూడా ఈ చక్కెరను ఉపయోగిస్తూ ఉంటాం. కానీ చక్కెరను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ చాలామంది ఆ విషయాన్ని పెడచెవిన పెట్టి మరి చక్కెరను అధికంగా వాడి డయాబెటిస్ వంటి వ్యాధులను తెచ్చుకుంటూ ఉంటారు.

కానీ మీకు తెలుసా ఫుడ్ లో చక్కెరను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచి లాభాలు కలుగుతాయట. మరి చక్కెరను తక్కువగా తీసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చక్కెర ఎక్కువగా వాడడం వల్ల లివర్‌ కీ మంచిది కాదు. కాబట్టి లివర్‌‌ ని కాపాడుకోవాలంటే చక్కెర వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు. దీని వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అధిక రక్త చక్కెర స్థాయిలు ఇన్సులిన్ నిరోధకతకి దారితీస్తాయి. ఇది ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ కీ కారణం అవుతుంది. కాబట్టి, చక్కెరని ఎక్కువగా తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ​ఎక్కువ చక్కెర తీసుకుంటే చర్మ సమస్యలు వస్తాయట.

అందులో చర్మ సమస్యలకి కారణమయ్యే గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే చర్మం జిడ్డుగా మారుతుంది. మొటిమలు పెరుగుతాయి. కాబట్టి, చక్కెర వాడకాన్ని తగ్గించడం వల్ల చర్మ సమస్యలు కూడా రావని చెబుతున్నారు. నోటి బ్యాక్టీరియా ద్వారా చక్కెర విచ్చిన్నం అవుతుంది. దీని వల్ల దంతాల ఉపరితలం దెబ్బతింటుంది. ఇది దంత సమస్యలకి కారణం అవుతుంది. అంతేకాకుండా చిగుళ్ళ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి చక్కెరని తక్కువగా తీసుకోవడం మంచిది. ఎక్కువగా చక్కెర తీసుకుంటే మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అలా కాకుండా ఉండేందుకు పంచదారు బదులు తాజా పండ్లు, గ్రెయిన్స్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే చక్కెరని తగ్గించడం వల్ల కలిగే లాభాల్లో ముందుగా బరువు తగ్గడం. బరువు పెరగడానికి పంచదార ముఖ్య కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు స్వీట్లు వంటివి ఎక్కువగా తీసుకోకుండా ఉండటం వల్ల బరువు ఈజీగా తగ్గవచ్చట.

note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.