మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా మందుబాబులు మద్యం సేవించడం మాత్రం ఆపరు. అయితే చాలామంది ఈ ప్రేమించిన వ్యక్తుల కోసం అలాగే దేవుడు ఆలయాలకు వెళ్ళినప్పుడు మద్యం తాగకూడదు అని నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు. అలా ఒక్కసారిగా మందు తాగడానికి ఆపేస్తూ ఉంటారు. అలా మందు తాగడం ఆపేయడం మంచిదేనా ఒకవేళ అలా ఆపేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మందుబాబులు ఉన్నపళంగా మద్యం మాన్పించేస్తే అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
అలా ఉన్నట్టుండి మద్యం సేవించడం మానేస్తే ఆల్కహాల్ విత్ డ్రాల్ సిండ్రోమ్ వస్తుంది.
ఆల్కహాల్ విత్ డ్రాల్ సిండ్రోమ్ అనేది అధికంగా మద్యపానం చేసేవారు అకస్మాత్తుగా మద్యం తాగడం మానేసినా, లేదా ఆల్కహాల్ తీసుకోవడాన్ని గణనీయంగా తగ్గించినా సంభవించే లక్షణాలు ఏవి అన్న విషయానికి వస్తే. తేలికపాటి ఆందోళన మరియు అలసట నుండి వికారం వరకు శారీరక భావోద్వేగ లక్షణాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే లక్షణాలు భ్రాంతులు, మూర్ఛలు వలె తీవ్రంగా ఉంటాయి.
అత్యంత విపరీతమైన ఆల్కహాల్ విత్ డ్రాల్ సిండ్రోమ్ ప్రాణాంతకం కావచ్చు. ఆల్కహాల్ ఉపసంహరణ సిండ్రోమ్ లక్షణాలు మీ చివరి డ్రింక్ తర్వాత 6 గంటల నుండి కొన్ని రోజుల వరకు ఎప్పుడైన కనిపించవచ్చు. వణుకు, ఆందోళన, వికారం, వాంతులు తలనొప్పి వేగంగా గుండె కొట్టుకోవడం చెమటలు పట్టడం, చిరాకు, గందరగోళం, నిద్రలేమ,చెడు కలలు ,హైబీపీ లక్షణాలు 2 నుండి 3 రోజులలో తీవ్రమవుతాయి. కొంతమంది వ్యక్తులలో కొన్ని తేలికపాటి లక్షణాలు వారాలపాటు కొనసాగవచ్చు.. ఆల్కహాల్‌కు బానిసగా మారిన వ్యక్తులు లేదా రోజూ ఎక్కువగా తాగే వారు. అలాగే తాగడాన్ని కంట్రోల్ చేయలేని వారు AWS బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పెద్దలలో AWS సర్వసాధారణం. కానీ పిల్లలు మరియు యువకులు ఎక్కువగా తాగే వారు కూడా లక్షణాలను అనుభవించవచ్చు.