Tea and Coffee: వేడివేడి కాపీలు టీలు తాగుతున్నారా.. అయితే తప్పనిసరిగా ఇది తెలుసుకోవాల్సిందే!

చాలామందికి వేడివేడి కాఫీ వేడి వేడి టీ తాగడం అలవాటు. అయితే ఇది అసలు మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Tea And Coffee

Tea And Coffee

మామూలుగా చాలామందికి ఏదైనా కానీ వేడిగా ఉన్నప్పుడు తినడమే అలవాటు. చల్లగా అయిన తర్వాత తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎంతమంది కాఫీ టీలు వేడివేడిగా కాలిపోతున్నా కూడా అలాగే తాగేస్తూ ఉంటారు. పొగలు కక్కుతూ ఉన్నా కూడా అలాగే తాగేస్తూ ఉంటారు. అలా తాగితేనే బాగుంటుందని అంటూ ఉంటారు. నిజానికి కాఫీలు టీలు ఇలా వేడివేడిగా ఉండడం తాగడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. బాగా వేడిగా ఉన్న కాఫీలు టీలు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

వేడి ఎక్కువగా ఉండేవి తినడం వల్ల అన్నవాహిక దెబ్బతింటుందట. కాబట్టి మరీ అంత వేడివి కాకుండా కొంచెం వేడి తక్కువగా ఉన్న కాఫీలు టీలు తాగడం మంచిది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని గ్యాస్, అల్సర్లు, మంట, చికాకు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే వేడి టీ, కాఫీలు తాగితే అన్న వాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. ఎక్కువగా వేడి పానీయాలు తాగడం వల్ల గొంతు, నోరు, కడుపు పొరకు హాని కలుగుతుందట.

స్త్రీలు కూడా ఎక్కువగా వేడి టీ, కాఫీలు తాగడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయట. గర్భిణీలు అస్సలు వేడివి తాగకూడదని, దీనివల్ల సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అలాగే వేడివేడిగా ఉండే కాఫీలు ఇతర ఆహార పదార్థాలు తినడం వల్ల నాలుక కాలే అవకాశం ఉంటుంది. ఇలా నాలుక కాలడం వల్ల ఇతర ఆహార పదార్థాలు తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు వేడివేడి ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు.

  Last Updated: 18 Mar 2025, 01:53 PM IST