Site icon HashtagU Telugu

‎Rice: నెలరోజుల పాటు అన్నం తినడం మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Rice

Rice

Rice: ‎భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో అన్నం ప్రధాన ఆహారం అన్న విషయం తెలిసిందే. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరానికి కావలసిన త్వరిత శక్తిని, సంతృప్తి భావనను కలుగజేస్తుందట. అన్నం తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు. అయితే ఇటీవల కాలంలో చాలామంది అన్నానికి బదులుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే చపాతీ రోటీ వంటివి తీసుకుంటున్నారు. అలా అన్నం తినడం నెమ్మదిగా మానేస్తున్నారు. అయితే అన్నం నెలరోజుల పాటు తినకుండా ఉంటే ఏం జరుగుతుందో శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎నెలరోజుల పాటు అన్నం తినకుండా ఉంటే శరీరానికి పూర్తిగా మేలు జరుగుతుందని చెప్పలేం అంటున్నారు. ఎందుకంటే అన్నంలో పోషకాలు తప్పనిసరిగా ఉంటాయి. శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉంటాయి. శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం కాబట్టి అన్నం తినకపోతే శరీరానికి పూర్తిగా మేలు జరుగుతుంది అని చెప్పలేము. అయితే నెలరోజులు అన్నం తినకపోతే బరువు తగ్గే అవకాశం ఉంటుందట.
‎అన్నం తినకుంటే బరువుకు చెక్, బ్లడ్ షుగర్ కంట్రోల్ అన్నంలో కేలరీలు ఎక్కువగా ఉండడంవల్ల అన్నాన్ని తినకుండా మానుకున్నప్పుడు క్యాలరీలు తగ్గి బరువు తగ్గుతారట.

‎అన్నాన్ని ఒక నెలరోజుల పాటు తినకుండా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుందట. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అన్నం మానేస్తే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెబుతున్నారు. నెల రోజులపాటు అన్నం తినకపోతే మన శరీరంలో శక్తి క్షీణిస్తుందట. నీరసంగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే మనకు శక్తి రావాలంటే కార్బోహైడ్రేట్లు ప్రధాన వనరు. అటువంటి కార్బోహైడ్రేట్లను తీసుకోకపోతే నీరసించి పోవడం ఖాయం అని, అన్నం మానేస్తే మన శరీరానికి కావలసిన తగినంత పోషకాలు అందకపోవచ్చని దీనికి బదులుగా అన్నం నుండి వచ్చే క్యాలరీలను భర్తీ చేసే ఇతర ధాన్యాలను, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. అలాగే అన్నం పూర్తిగా మానేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవచ్చట. కాబట్టి నెలరోజుల పాటు అన్నం మానేయాలి అనుకునేవారు అన్నానికి బదులుగా తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు వంటివి తినాలట. అవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను కచ్చితంగా అందిస్తాయని చెబుతున్నారు.

Exit mobile version