Blood Sugar: షుగర్ లెవెల్స్ 350 దాటితే ఏం జరుగుతుందో తెలుసా.. ఎలా నియంత్రించాలంటే?

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.

  • Written By:
  • Publish Date - July 10, 2022 / 03:00 PM IST

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. ఈ డయాబెటిస్ సమస్యను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ మధుమేహం రెండు రకాలుగా కూడా ఉంటుంది. మొదటిది టైప్ వన్ డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. ఇక రెండవది డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు రకాల మధుమేహం లోను రోగిలో ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తాయి. ఆహార నియంత్రించడం చురుకైన జీవనశైలి ద్వారా చక్కెర నియంత్రణలో ఉంచబడుతుంది. డయాబెటిస్ పేషెంట్లు ప్రతిరోజు కూడా తమ సుగర్ ని చెక్ చేసుకోవడం తప్పనిసరి. మధుమేహం ఉన్నవారు ఉపవాసం నుంచి భోజనం రాత్రి భోజనం తర్వాతి వరకు రక్తంలో చక్కెర స్థాయి ఏమిటి అన్నది తెలుసుకోవాలి.

140mg/dl తర్వాత మధుమేహం ఉన్న రోగులు రక్తంలో చక్కెర స్థాయి సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. రాత్రి భోజనం తర్వాత రక్తంలోచక్కెర స్థాయి 150mg/dl ఉంటే అది సాధారణం. అలాకాకుండా రక్తంలో చక్కెర స్థాయి 300 mg/dl ఉంటే అది అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. మరి రక్తంలో చక్కెర స్థాయి తిరిగితే ఎలాంటి నష్టాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఆ వ్యక్తికి ఎక్కువగా దాహం అనిపిస్తుంది. అనుకోకుండా త్వరగా అలిసిపోతాడు. రక్తంలో అధిక చెక్కర కారణంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. కళ్ళు కూడా అస్పష్టంగా మారుతాయి.

అదేవిధంగా తరచుగా మూత విసర్జన, మూర్ఛ, వాంతులు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాగా వీటిని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే బాగా నడవాలి. అలా బాగా నడవడం వల్ల శరీరం చురుకుగా ఉంటూ చక్కర నియంత్రణలో ఉంటుంది. మధుమేహం పెరిగినప్పుడు ఎక్కువ నీరు త్రాగాలి. అదేవిధంగా టైం టు టైం భోజనం చేయాలి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం తగ్గించాలి. షుగర్ ని నియంత్రించడం కోసం ఎక్కువగా నీరు త్రాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే మీకు ఎక్కువ మూత్రం వస్తుంది దాని ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి