మామూలుగా సందర్భానుసారం కొందరు షూ దరిస్తే మరికొందరు స్టైలిష్ గా ఉండడం కోసం షూస్ ధరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది సాక్స్ లేకుండా షూస్ అస్సలు వేసుకోరు. ఇంకొంతమంది మాత్రం అవేవీ పట్టించుకోకుండా సాక్సులు లేకపోయినా షూస్ అలాగే ధరిస్తూ ఉంటారు. అయితే ఇలా ధరిస్తే చాలా సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పాదాలకు సంబంధించిన సమస్యలే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయట. మరి ఈ సాక్స్ లేకుండా షూ ధరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం ధరించడం వల్ల పాదాలకు హాని జరగడమే కాకుండా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు వస్తాయట.
కాబట్టి షూ వేసుకునే ముందు అది సరైనదో కాదో తెలుసుకోవాలని చెబుతున్నారు. బిగుతుగా లేదా వదులుగా ఉండే బూట్లు వేసుకోకూడదట. బిగుతుగా ఉన్న షూ ధరించనప్పుడు సాక్స్ వేసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఎందుకంటే వాటి ప్రభావం నేరుగా పాదాల చర్మం మీద పడకుండా సాక్సులు కాపాడి సౌకర్యం ఇస్తాయట. ఒకవేళ సాక్సులు ధరించినప్పటికీ మంచి నాణ్యమైనవీ ధరించాలని చెబుతున్నారు. మంట,దరుద సమస్యలు పాదాలకు, బూట్లకు మధ్య సాక్స్ రక్షణ కవచంగా పనిచేస్తాయట. సాక్సులు లేకుండా బూట్లు వేసుకుని ఎక్కువసే పు నడవటం, పరిగెత్తడం వల్ల పాదాల్లో బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంటుందట. దీంతో మంట, దురద సమస్యలు వస్తాయట. ఇన్ఫెక్షన్లు ఎక్కువ సేపు బూట్లు ధరించినప్పుడు పాదాలలో చెమట పట్టడం సాధారణం. ఈ చెమటను పీల్చుకుని పాదాలను పొడిగా ఉంచడానికి సాక్స్ లు పనిచేస్తాయట.
సాక్స్ లేకుండా చెమట ఆరిపోదు. దీని కారణంగా పాదాలలో తేమ పెరుగుతుంది. దీంతో అలర్జీ, అనేక రకాల బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందట. అలర్జీ కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల బూట్లు తో సాక్స్‌లు ధరించడం బెటర్. దుర్వాసన పాదాలలో తేమ కారణంగా బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దీంతో పాదాల నుండి తరచుగా దుర్వాసన రావడం మొదలవుతుందట. మెయిన్ గా సాక్స్ లేకుండా లెదర్ షూస్ వేసుకుంటే ఈ సమస్య రెట్టింపు అవుతుందట. ఎక్కువ సేపు సాక్స్ లేకుండా షూ వేసుకోవడం వల్ల పాదాలలో తేమ పెరుగుతుందట. అలాగే రాపిడి కారణంగా చర్మ ఇన్ఫెక్షన్లు వస్తాయట. ఈ ఇన్ఫెక్షన్ అలాగే నిర్లక్ష్యం చేస్తే సెల్యులైటిస్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చని చెబుతున్నారు.