Smartphone: స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకొని నిద్ర పోతే ఏమవుతుంది?

స్మార్ట్ ఫోన్ (Smartphone) మనల్ని స్మార్ట్ గా చేయలేదు.. దానికి బానిసగా మార్చుకుంది. మన బాడీలో ఒక భాగంగా అది మారిపోయింది. ఒంటరిగా ఉన్నా మనం ఫీల్ కావట్లేదు కానీ.. స్మార్ట్ ఫోన్ లేకుంటే మాత్రం ఫీల్ అవుతున్నాం. ఆ ఫోన్ చూసుకుంటూ ఎప్పుడో అర్ధరాత్రి ఒంటి గంటకు, రెండు గంటలకు నిద్రపోతున్నాము. రాత్రిపూట సెల్ ఫోన్ ను చూసి చూసి..హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ దాదాపు 18 నెలల పాటు తీవ్ర కంటి సమస్యను ఎదుర్కొంది. అందుకే రాత్రి స్మార్ట్ ఫోన్ (Smartphone) ఎక్కువగా చూడొద్దు. చాలామంది రాత్రి ఫోన్ చూసి చూసి దాన్ని తల పక్కనే పెట్టుకుని పడుకుంటుంటారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల..

రాత్రి పూట ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మీ దృష్టి దెబ్బతింటుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్య ఎదురౌతుంది.అందుకే ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తాయి అనుకునే వారు మాత్రమే రాత్రివేళ ఫోన్ బెడ్ రూమ్ లో పెట్టుకోవాలి. బెడ్ మీద కాకుండా కాస్త దూరంగా ఫోన్ పెట్టుకోవాలి.

బ్రెయిన్ లో ప్రతిరోజు రాత్రి..

నిద్ర రావడానికి మన బ్రెయిన్ లో ప్రతిరోజు రాత్రి మెలటోనీ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీరు వాడే స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే బ్లూలైట్ వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాకుండా మీరు స్మార్ట్ ఫోన్ వాడుతూ నైట్ అంతా అలర్ట్ గా ఉంటారు. సరిగ్గా నిద్రపోలేరు. పెద్దలు అయితే 6 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రపోవాలి. యుక్త వయసులో ఉన్నవాళ్లు 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. ఈ మెలటోనీ ఉత్పత్తి తగ్గడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. సరిగ్గా నిద్రలేక తెల్లవారిన తర్వాత ఆఫీస్ లో యాక్టివ్ గా ఉండలేరు. ఊరికే చికాకుగా ఉంటారు. పని మీద కాన్సన్ ట్రేట్ చేయలేరు.

వ్యాధుల ముప్పు

అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల మీకు నిద్రలేమి సమస్య వస్తుంది. ఈ నిద్రలేమి సమస్యకు తోడుగా.. ఊరికే తలనొప్పి రావడం, అధిక బరువు పెరగడం, రక్తపోటు, జీర్ణకోశ సమస్యలు, కొందరికి అయితే షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు స్మార్ట్ ఫోన్ వాడితే వచ్చే నిద్రలేమి సమస్యకు అనుబంధంగా చాలా మందికి ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎంతో ప్రమాదం.

మెదడు క్యాన్సర్ ముప్పు

మొబైల్‌ నుంచి వెలువడే అధిక రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్మార్ట్‌ఫోన్ వాడకందారులు క్యాన్సర్ బారినపడినట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల రేడియో తరంగాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

చార్జింగ్ పెట్టుకొని మాట్లాడితే..

కొందరు ఫోన్ చార్జింగ్ పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఇది మరీ ప్రమాదకరం… దీనివల్ల అధికస్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. ఒక్కోసారి ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

Also Read:  Turmeric: పచ్చి పసుపు మరియు పసుపు పొడి మధ్య వ్యత్యాసం – మీకు ఏది మంచిది?