Site icon HashtagU Telugu

Helath Tips: ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉందా.. అయితే జాగ్రత్త ఈ జబ్బులను ఏరికోరి మరి తెచ్చుకున్నట్టే!

Helath Tips

Helath Tips

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ వినియోగిస్తూనే ఉంటారు. టాయిలెట్ కి వెళ్లిన బైక్ డ్రైవ్ చేస్తున్న తింటున్న ఇలా ప్రతి ఒక్క చోట స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తూనే ఉన్నారు. అయితే వీటిలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు తింటున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ వినియోగించడం. ఇంట్లో పెద్దలు తిట్టినా కూడా వినిపించుకోకుండా అలాగే మొబైల్ ఫోన్ చూస్తూ తింటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇదే అలవాటు పిల్లలకు కూడా మొదలైంది. అయితే ఇది అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. మరి భోజనం చేస్తూ మొబైల్ ఫోన్ చూస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు తొందర తొందరగా తినకూడదట. ఆహారాన్ని నిదానంగా నమిలి మింగాలని అప్పుడే మనం తిన్న ఆహారం కూడా ఒంటికి పడుతుందని తిన్నది కూడా డైజెస్ట్ అవుతుందని చెబుతున్నారు. అయితే చాలామంది మొబైల్ ఫోన్లు చూస్తూ గబగబా తినేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గొంతులో అన్నం ఇరుక్కుపోవడం ఎంత తింటున్నామో లెక్క లేకపోవడం వల్ల అధిక బరువు వంటి సమస్యలు కూడా వస్తాయట. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్. వీటిలో ఏదైనా సరే,కనీసం 20 నిముషాల పాటు తినాలట. మనం ఏం తింటున్నా సరే బ్రెయిన్ కి, పొట్టకి కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. హార్మోనల్ సిగ్నల్స్ ద్వారా ఎంత తినాలి ఇంకా ఎంత తినొచ్చు అనేది తెలుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా సాఫీగా జరగాలంటే కనీసం 20 నిముషాల సమయం పడుతుంది.

అంటే మనం ఏం తినాలన్నా సరే దాని కోసం 20 నిముషాల టైమ్ కచ్చితంగా కేటాయించాలన్న మాట. ఈ మాత్రం టైమ్ కూడా కేటాయించకుండా గబగబా తినేస్తే బ్రెయిన్ కి, పొట్టకి మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోతుందట. అప్పుడు ఎంత తింటున్నామో తెలియదు. ఒక్కోసారి కావాల్సిన దాని కన్నా ఎక్కువ తినే ప్రమాదం ఉంటుందట. ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుందని చెబుతున్నారు. వేగంగా తినే వాళ్లు ఎక్కువగా గాలిని పీల్చుకుంటారు. ఫలితంగా కడుపు ఉబ్బరంతోపాటు అజీర్తితో ఇబ్బంది పడాల్సి వస్తుందట. వేగంగా తినే క్రమంలో సరిగ్గా నమలకుండా మింగేస్తారు. ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. ఈ కారణంగా శరీరానికి సరైన విధంగా పోషకాలు అందవు. సరిగ్గా నమలకపోతే ఆహారం అన్నవాహికలో ఇరుక్కుపోయే ప్రమాదమూ ఉంటుంది. వేగంగా తినే వాళ్లకు ఊబకాయం వచ్చే ప్రమాదమూ ఉంటుంది. కాస్త నెమ్మదిగా తినే వాళ్లలో ఈ ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు. ఇలా తినడం వల్ల బీపీ షుగర్ వంటివి అమౌంట్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయట. పొట్ట చుట్టూ కొవ్వుకి పేరుకు పోతుందని చెబుతున్నారు. టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటాయట. ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా ఉండాలంటే భోజనం చేసేటప్పుడు స్మార్ట్ ఫోన్లు టీవీలు వంటివి చూడకూడదని, తినేటప్పుడు నిదానంగా నెమ్మదిగా తినాలని, తిన్న ఆహారం కూడా నమిలి బాగా మింగాలని చెబుతున్నారు.