Site icon HashtagU Telugu

Phone: మొబైల్ చూస్తూ అన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Mixcollage 16 Feb 2024 08 10 Pm 2154

Mixcollage 16 Feb 2024 08 10 Pm 2154

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లనే ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్స్ అనేవి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. మరి పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ లకి బానిసలు అయిపోతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఫోన్ చూస్తూ అన్నం తింటున్నారు. అయితే రెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 90% మంది సెల్ ఫోన్ చూస్తూ అన్నం తింటున్నారని అధ్యయనాల్లో తేలింది. కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఇలా భోజనం చేస్తూ ఏదైనా ఇతర పదార్థాలు తింటూ సెల్లు చూస్తూ ఉంటారు. ఇలా మొబైల్ ఫోన్ చూస్తూ ఆహారం తినడం అన్నది అంత మంచి విషయం కాదు.

దీని వలన వారిపై మానసికంగా, శారీరకంగా చెడు ప్రభావం పడుతుంది. పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తే, అది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. సెల్ ఫోన్ చూసే పిల్లలు నలుగురిలో కంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరితో సరిగా మాట్లాడరు. ఇదే దీర్ఘకాలంలో ఇతర సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు మొబైల్ చూస్తూ ఫోన్ తినడం వలన వాళ్ళు ఏది తింటున్నారో కూడా గమనించరు. ఏదో ఒకటి తింటున్నాం అనుకుంటారు తప్ప వాళ్లు తినే ఆహారం రుచి తెలియదు. తిండి బాగుందో లేదో కూడా అర్థం కాదు. ఫోన్ చూస్తూ కొందరు ఎక్కువగా ఆహారం తింటుంటారు మరికొందరు తక్కువగా తింటారు. దీంతో వాళ్ళు తాము ఎంత తింటున్నామో కూడా వాళ్లకు అర్థం కాదు.

పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూస్తే కళ్ళు బలహీనంగా తయారవుతాయి. దీనివలన వాళ్ళు చిన్న వయసులోనే కళ్ళజోడు ధరించాల్సి ఉంటుంది. అంతేకాదు చిన్నప్పటినుంచి స్క్రీన్ దగ్గర ఉండి చూడటం వలన రెటీనా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు ఫోన్ చూస్తూ అన్నం తినడం వలన తల్లి, బిడ్డల సంబంధం పై చెడు ప్రభావం పడుతుంది. వాళ్లు అన్నం తిన్నప్పుడు తల్లిని చూడరు. దీనివలన వారి మధ్య బాండింగ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోన్ చూస్తూ అన్నం తినడం వలన జీవక్రియ రేటు తగ్గిపోతుంది. దీనివలన ఆహారం ఆలస్యంగా జీర్ణం అవుతుంది. దీంతో వారికి మలబద్ధకం గ్యాస్ కడుపు ఉబ్బరం నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.