Site icon HashtagU Telugu

Jaggery: భోజనం తిన్న తర్వాత బెల్లం తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Jaggery

Jaggery

మామూలుగా మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. తప్పనిసరిగా భోజనం చేసిన తర్వాత స్వీట్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది స్వీట్ కి బదులుగా బెల్లం తింటూ ఉంటారు. మరి ఇలా తినడం మంచిదేనా, భోజనం తర్వాత బెల్లం తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ లు ఉత్తేజితమవుతాయట. దీని కారణంగా ఆహారం సులభంగా విచ్ఛిన్నమవుతుందని, త్వరగా జీర్ణమవుతుందని చెబుతున్నారు.

అలాగే బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ ను నియంత్రిస్తుందని, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందట. భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల శరీరంలోని జీవక్రియ వేగంగా, బలంగా మారుతుందని,ఇది బరువు నియంత్రణను సులభతరం చేస్తుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే బెల్లంలో సహజసిద్ధమైన నిర్విషీకరణ గుణాలు ఉన్నాయి.

ఇది మన శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి కాలేయాన్ని శుభ్రపరుస్తుందని చెబుతున్నారు. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందట. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని,ముఖ్యంగా మహిళలు,పిల్లలకు ఇది చాలా మంచిది అని చెబుతున్నారు. మీరు ఎప్పటినుంచో మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నట్టయితే భోజనం తర్వాత క్రమం తప్పకుండా బెల్లం తినడం మంచిదని చెబుతున్నారు. బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని చెబుతున్నారు.

Exit mobile version