Site icon HashtagU Telugu

Health Tips: రాత్రి 9 తర్వాత తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Health

Health

కాలంతో పాటు మనుషులు, మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి అన్ని మారిపోయాయి. ఇదివరకటి రోజుల్లో పెద్దలు రాత్రి ఎనిమిదింటికి లోపు తిని పడుకుని నిద్రపోయేవారు.. అందుకే అప్పట్లో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి కావు. కానీ ఇప్పటిలో మాత్రం అర్ధరాత్రి 12 అయినా ఇంకా మేలుకొని ఉండడం ఆ సమయంలో భోజనం చేయడం లాంటివి చేస్తుంటారు. మరి ముఖ్యంగా సిటీలలో రాత్రి 9 తర్వాతనే ఎక్కువగా భోజనాలు చేసే వాళ్ళు ఉన్నారు. రాత్రి ఎప్పుడూ 11 గంటలకు తినడం ఉదయాన్నే 8:00 వరకు నిద్ర లేవకుండా అలాగే పడుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఏరుకోరి మరి కొని తెచ్చుకుంటున్నారు.

ముఖ్యంగా రాత్రి 9 తర్వాత తింటే అనేక రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి తొమ్మిది తర్వాత తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం భోజనం చేస్తున్నాము అన్న విషయాన్ని మాత్రమే కాకుండా ఆ భోజనాన్ని ఏ సమయంలో చేస్తున్నాము అన్న విషయాన్ని కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. సరైన సమయంలో భోజనం చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు భోజనం తింటే తిన్న ఆహారం సరిగా ఒంటికి పట్టకపోగానే సమస్యలు వస్తాయట. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల విపరీతమైన బరువు పెరుగుతారట. అలాగే జీర్ణ సమస్యలు వస్తాయని, రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదని, అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం వల్ల భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. రాత్రిపూట ఎక్కువగా సహాయం తినడం వల్ల అధిక రక్తపోటు షుగర్ లెవెల్స్ లో మార్పులు వస్తాయట. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత తినడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడులోని రక్త నాళాలు పగిలి రక్తస్రావం అవుతుందట. అలాగే, రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదట. ఇది కూడా పక్షవాతానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రి సమయంలో కొంచెం ఎర్లీ గానే భోజనం చేసి కొద్దిసేపు వాకింగ్ లాంటిది చేసి ఆ తర్వాత పడుకోవడం మంచిది. మీరు పడుకోవడానికి, భోజనం చేయడానికి మధ్య మూడు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.