కార్న్ ఫ్లోర్ దీనిని మొక్కజొన్న పిండి అని పిలుస్తారు. ఈ కార్న్ ఫ్లోర్ ని చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచి చేసేది అయినప్పటికీ అతిగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది స్నాక్స్ రూపంలో తీసుకోవడం కోసం ఈ కార్న్ ఫ్లోర్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. మరి ఈ మొక్కజొన్న పిండి ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొక్కజొన్న పిండిని ఎన్నో రకాల వంటకాలకు ఉపయోగిస్తారు. ఇది ఫుడ్ కు క్రంచ్ నెస్ ను తీసుకొస్తుంది.
అందుకే చికెన్, ఫిష్, కాలీఫ్లవర్, బంగాళాదుంప లాంటి చాలా ఆహారాలకు మొక్కజొన్న పిండిని ఉపయోగిస్తుంటారు. కానీ దీన్ని మోతాదుకు మించి తింటే మాత్రం మీరు ఎన్నో సమస్యల బారిన పడతారట. ఒక కప్పు మొక్కజొన్న పిండిలో దాదాపుగా 490 కేలరీలు, 120 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుందట. ఈ మొక్కజొన్న పిండిలో ప్రోటీన్లు, విటమిన్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయట. అందుకే ఇది ఆరోగ్యంగా ఉంచడం కంటే,ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే ఎక్కువగా ఉంటుందట. బరువు మాత్రం పెరగకూడదనుకునేవారు చాలా మందే ఉన్నారు.
మొక్క జొన్న పిండిని ఎక్కువగా తింటే మాత్రం ఖచ్చితంగా బరువు పెరిగిపోతారట. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు మొక్కజొన్నపిండికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పిండిలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట. అందుకే దీన్ని ఎక్కువగా తింటే మీరు బరువు విపరీతంగా పెరుగుతారట. డయాబెటీస్ పేషెంట్లకు మొక్కజొన్న పిండి అంత మంచిది కాదట. ఎందుకంటే ఈ పండిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ బరువును పెంచడంతో పాటుగా మీకు డయాబెటీస్ వచ్చేలా చేస్తుందట. ఈ పిండిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయని చెబుతున్నారు. మొక్కజొన్న పిండి ప్రాసెస్ చేయబడుతుంది. కాబట్టి ఈ పండిలో ఫైబర్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉండవు. అందుకే ఈ పిండిని రోజూ తింటే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మొక్కజొన్న పిండిని రోజూ, ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయట. ముఖ్యంగా గ్యాస్, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఈ పిండి వల్ల వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.