Site icon HashtagU Telugu

Tea: టీ ఎక్కువగా తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

Mixcollage 10 Jul 2024 04 06 Pm 8438

Mixcollage 10 Jul 2024 04 06 Pm 8438

ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఉదయం లేవగానే టీ,కాఫీలు తాగడం అలవాటు. కాఫీ, టీ తాగకుండా ఏ పని ప్రారంభించరు. అంతేకాకుండా రోజులో కనీసం ఒక్కసారైనా కాఫీలు తాగనిదే రోజు కూడా గడవని వారు ఉన్నారు. అంతలా కాఫీ, టీ లకు ఎడిక్ట్ అయిపోయారు. కాఫీ, టీ లు తాగడం మంచిది కానీ శృతిమించి తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే రోజులో కనీసం నాలుగు ఐదు సార్లు అయినా టీ తాగుతూ ఉంటారు. అయితే ఇలా తాగడం ప్రమాదకరం అంటున్నారు వైద్యులు.

మరి టీ ని ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు టీ ఎక్కువగా తాగడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. తాగడం వల్ల శరీరం పొడిగా, నిర్జలీకరణంగా మారుతుంది. ఇది మల విసర్జనను మరింత కష్టతరం చేస్తుంది. అలాగే టీ ఆందోళన లక్షణాలను మరింత ఎక్కువ చేస్తుంది. అందుకే యాంగ్జైటీతో బాధపడేవారు టీని ఎక్కువగా తాగడం మానుకోవాలి..

అదేవిధంగా టీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని తక్కువ మొత్తంలో తీసుకోవడం వచ్చే సమస్యలు రావు. కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి. టీని ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. అందుకే సాయంత్రం 6 తర్వాత టీని తాగకూడదని వైద్యులు చెబుతూ ఉంటారు. మాములుగా తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే టీ ఎక్కువగా తాగడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఫలితంగా తలనొప్పి వస్తుంది.