మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో లవంగాలు కూడా ఒకటి. లవంగాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. లవంగాలను చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కాగా లవంగాలు కూరకు రుచిని పెంచడంతో పాటు అనేక లాభాలు కలిగిస్తాయట. అవును ఈ మసాలా దినుసులు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ చిన్న చిన్న మసాలా దినుసుల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, సోడియం, పొటాషియం, విటమిన్ బి, ఫోలేట్, నియాసిన్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, గ్లూకోజ్, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట.
వీటిని గనుక తింటే మనం ఎన్నో రోగాల ముప్పు నుంచి తప్పించుకుంటాం. అయితే రోజూ ఉదయాన్నే రెండు లవంగాలను నమలడం వల్ల చాలా లాభాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మందికి దంతాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. కానీ హాస్పటల్ కు మాత్రం వెళ్లరు. అలాగే నొప్పిని భరిస్తూ ఉంటారు. కానీ మీరు ఈ సమస్యలను తగ్గించుకోవడానికి లవంగాలను కూడా ఉపయోగించవచ్చట. అవును లవంగాల్లో అనాల్జేసిక్ లక్షణాలు ఉంటాయి. వీటిని ఉదయం పరిగడుపున నమలడం వల్ల పంటి నొప్పి ఇట్టే తగ్గిపోతుందట. నోరు కూడా ఆరోగ్యంగా ఉంటుందట.
కాగా పంటినొప్పితో బాధపడేవారు రోజూ రెండు లవంగాలను నమిలితే సమస్య కొన్ని రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతుందట. లవంగాలను ఉపయోగించి మీరు జీర్ణసమస్యలను కూడా తొందరగా తగ్గించుకోవచ్చట. లవంగాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుందట. ఉదయం పరిగడుపున రెండు లవంగాలను నమలడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుందట. మన రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే మనం దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే మాత్రం తరచుగా రోగాల బారిన పడాల్సి వస్తుంది. అయితే లవంగాల్లో విటమిన్ సి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
అంటే వీటిని ఉదయాన్నే పరిగడుపున తింటే కూడా మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందట. అలాగే లవంగాల్లో మాంగనీస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రోజూ ఉదయాన్నే పరిగడుపున 2 లవంగాలను నమలడం వల్ల మన ఎముకలు బలంగా అవుతాయట. కీళ్ల నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయట. లవంగాలు మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా ఉపయోగపడతాయట. ముఖ్యంగా వీటిని పరిగడుపున తినడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందట. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగ లక్షణ మార్పులను నిరోధిస్తాయట. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గించే గుణాలు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.