Site icon HashtagU Telugu

Breakfast: బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా.. బరువు పెరగడంతో పాటు ఎన్నో సమస్యలు?

Breakfast

Breakfast

ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా మూడు పూటలా సమయానికి భోజనం చేసినప్పుడే ఆరోగ్యం బాగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. రాత్రి ఆలస్యంగా పడుకోవడం వల్ల ఉదయాన్నే ఎప్పుడో 9,10,11 గంటలకు నిద్ర లేచి ఆ సమయంలో బ్రష్ చేసి బ్రేక్ ఫాస్ట్ కి బదులుగా డైరెక్ట్ గా లంచ్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఉదయం కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని, లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

శరీరంలో మెటబాలిజంను ప్రారంభించడంలో బ్రేక్ ఫాస్ట్ యే కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు మంచి హెల్తీ ఫుడ్ మన ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచేలా చేస్తుంది. ఒకవేళ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం తినకపోతే బరువు పెరగడం, పోషకాల లోపాలతో పాటుగా ఎన్నో రోగాల ముప్పు కూడా ఉందట. కాబట్టి మొత్తం ఆరోగ్యం శ్రేయస్సు కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా తినాలి. బ్రేక్ ఫాస్ట్ ను తినేవారు తినని వారికంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారట. బ్రేక్ ఫాస్ట్ మన మెదడును ఆరోగ్యంగా, షార్ప్ గా ఉంచుతుంది. ఇది మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు మనల్ని బలంగా, పదునుగా మారుస్తుందని చెబుతున్నారు.

అలాగే పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు, ప్రోటీన్ ఉన్న ఆహారాలను తింటే మన ఏకాగ్రత పెరుగుతుందట. తృణధాన్యాలు, ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు మీ శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అంతేకాదు బ్రేక్ ఫాస్ట్ మీ శరీరాన్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ఉదయాన్నే భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతామని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ఉదయం తినకపోవడం వల్ల మీరు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మీరు ఉదయం తినకపోతే మధ్యాహ్నం హెవీగా తింటారు. ఇది మీ శరీర మెటబాలిజానికి అంతరాయం కలిగిస్తుంది. దీంతో మీరు విపరీతంగా బరువు పెరిగేలా చేస్తుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన పోషకాలు, ఖనిజాలు ఉన్న బ్రేక్ ఫాస్ట్ ను తినాలి. మీరు ఉదయం తినకపోతే పోషక లోపాల ప్రమాదం పెరుగుతుంది. ఇది వివిధ శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఇది మీకు ఎన్నో రోగాలు వచ్చేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది..

Exit mobile version