ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజూ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అందులో భాగంగానే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంత హెల్తీగా ఉంటే ఆ రోజంతా కూడా అంత హ్యాపీగా అంత యాక్టివ్ గా ఉంటాం. అందుకే ఉదయాన్నే తీసుకునే బ్రేక్ ఫాస్ట్ మంచి పోషకాలతో నిండి ఉన్నదే తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మొలకలు కూడా ఒకటి. మొలకలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిలో పెసర్ల మొలకలు ఒకటి. ఈ మొలకల్లో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఇతర పోషకాలకు మంచి వనరు. మొలకెత్తిన పెసరపప్పును మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు వైద్యులు.
మరి మొలకల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే మొలకలను తినడం వల్ల మీరు ఆరోగ్యంగా, రీఫ్రెష్ గా ఉంటారు. వీటిని సలాడ్లు, శాండ్విచ్లు లేదా ఇతర మార్గాల్లో తినడానికి ఇష్టపడుతుంటారు. ఉదయం అల్పాహారంలో మొలకలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మొలకల్లో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. అలాగే మొలకెత్తిన పెసరపప్పులో మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, ప్రోటీన్, ఫైబర్ వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మొలకెత్తిన పెసరపప్పులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది.
ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. మొలకల్లో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే రోగాలతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. మొలకలను తింటే ఎన్నో రకాల వ్యాధులతో మన శరీరం పోరాడుతుంది. మొలకల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి మొలకలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. మొలకల్లో ఉండే ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే రక్తపోటును నార్మల్ గా ఉంచడానికి సహాయపడతాయి. ఉదయాన్నే మొలకలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లకు ఈ మొలకలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు వైద్యులు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.