Soaked Dates: ప్రతిరోజు నానబెట్టిన ఖర్జూరం తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

నానబెట్టిన ఖర్జూరం తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Soaked Dates

Soaked Dates

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఖర్జూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఖర్జూరాల్లో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5ఎ1 వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ కూడా మెండుగా ఉంటుంది. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం మంచిది. అందుకే వైద్యులు కూడా తరచుగా ఖర్జూరాలు తీసుకోమని చెబుతూ ఉంటారు.

అయితే మరీ నానబెట్టిన ఖర్జూరాలను రోజూ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అజీర్ణం, మలబద్దకం సమస్యలతో బాధపడేవారు ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలను తినడం వల్ల మలబద్దకం నుంచి బయటపడవచ్చట. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే రక్తహీనత సమస్య ఎన్నో వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఈ సమస్య మగవారికంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే శరీరంలో ఐరన్ కంటెంట్ ను పెంచడానికి, రక్తహీనతను నివారించడానికి ఖర్జూరాలను నానబెట్టి తినడం మంచిది. నానబెట్టిన ఖర్జూరాలు శరీరంలో రక్తాన్ని పెంచుతాయని పోతున్నారు. అదేవిధంగా ఖర్జూరాల్లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

ఇవి రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఖర్జూరాలను తినాల్సిందే అంటున్నారు. అలాగే ఖర్జూరాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నార. రోజూ లిమిట్ లో నానబెట్టిన ఖర్జూలను తింటే ఎముకల సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుందట. కాగా ఖర్జూరాల్లో విటమిన్ బి 6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి తెలివితేటలను పెంచుతాయట. అలాగే ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతాయని చెబుతున్నారు

  Last Updated: 14 Aug 2024, 01:41 PM IST