Site icon HashtagU Telugu

Health Tips: భోజనం తర్వాత సోడా, కూల్‌డ్రింక్స్ వంటివి తాగుతున్నారా.. అయితే ఇది మీ కోసమే!

Health Tips

Health Tips

మామూలుగా చాలామంది ఎక్కువగా భోజనం చేసిన తర్వాత కడుపు కొంచెం టైట్ గా ఉంది అని సోడా, కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ నిమ్మకాయ సోడా వంటివి తాగుతూ ఉంటారు. ముఖ్యంగా మసాలా వంటకాలను చికెన్ మటన్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తిన్నప్పుడు ఇలాంటి జ్యూస్ లు తాగుతూ ఉంటారు. అయితే ఇలా తాగడం వల్ల అప్పటికప్పుడు కాస్త రిలాక్స్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా ప్రాబ్లమ్స్ ని కొని తెస్తాయని చెబుతున్నారు.

భోజనం చేశాక సోడా , కూల్ డ్రింక్స్ తతాగడం వల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. కడుపులో రిలాక్స్‌గా అనిపిస్తుంది. కానీ, టెంపరరీ ఫీలింగ్. కానీ, సోడా తాగితే పొట్టలో నుంచి గ్యాస్ పోవడం కాదు పెరుగుతుందని అంటున్నారు. కడుపులో గ్యాస్ పెరిగితే దీని వల్ల ఊపిరి కష్టంగా మారుతుంది. కడుపు నొప్పి వస్తుంది. కడుపు మొత్తం కట్టిపడేసినట్టుగా ఉంటుంది. కూర్చోవడం, పడుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. దీంతో పాటు గుండెల్లో మంట, మలబద్ధకం, త్రేన్పులు, ఛాతీలో భారంగా ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత ఇలాంటి డ్రింక్స్ ని తాగకపోవడమే మంచిది.

మరి భోజనం చేసిన తర్వాత అలా కడుపు టైట్ గా అనిపించినప్పుడు ఏం తాగాలి అన్న విషయానికొస్తే.. కొద్దిగా గోరువెచ్చని నీరు తాగమని చెబుతున్నారు. భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో కాకుండా తిన్న తర్వాత తాగమని చెబుతున్నారు. భోజనం తర్వాత కడుపులో గ్యాస్ కూడా తగ్గుతుంది. అల్లం రసం కూడా తాగడం మంచిది. లేదా సోంపు తిన్నా కూడా మంచిదే. అదే విధంగా ఎప్పుడు కూడా అతిగా తినవద్దు. దీని వల్ల కడుపులో ఉబ్బరంతో పాటు జిర్ణ సమస్యలు వస్తాయి. ఆహారంతో పాటు నీరు కూడా సమానంగా ఉండేలా చూసుకోండి. దీంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకునేలా చూడాలి.