Site icon HashtagU Telugu

Smoke : రోజుకు పది సిగరెట్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Cigrette

Cigrette

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందరికీ తెలిసిందే. కానీ ఎవరూ పాటించరు. పొగతాగడం ఇప్పుడు ట్రెండ్. ఈ కాలం యూత్ సిగరెట్ తాగడమంటే ట్రెండ్ గా భావిస్తున్నారు. నోట్లో సిగరెట్  పెట్టుకుని దాన్ని పీల్చుతూ.. .గప్పులుగుప్పులు పొగను బయటకు వదులుతూ ఎంజాయ్ చేస్తుంటారు. పురుషులే కాదు మహిళల కూడా వ్యసనానికి బానిసలవుతున్నారు. కొందరికి గంటకో టీ…దానితోపాటు సిగరెట్ తాగాల్సిందే. ఇవి రెండు లేకుంటే ఏదో కోల్పోయామన్న బాధలో బతుకుతుంటారు.

రోజుకు పదికి పైగా సిగరెట్లు తాగేవాడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో మీకు తెలుసా. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు చాలా త్వరగా మృత్యువును చేరుకుంటారని వైద్య ప్రపంచం చెబుతోంది. కాబట్టి రోజుకు 10 లేదా అంతకంటే ఎక్కువ సిగరెట్లు తాగే వారికి ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

1. మీరు గమనించారా…ధూమపానం చేసే వ్యక్తి ఏదొక వ్యాధితో బాధపడుతుంటాడు. ఎందుకంటే క్రమంగా వారి శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అలాగే సిగరెట్ తాగేటప్పుడు పొగ లోపలికి వెళ్లిపోతుంది. ఇది ఊపిరితిత్తులతో సహా ఇతర అంతర్గత అవయవాలను దెబ్బతీస్తుంది. ప్రధానంగా పక్షవాతం, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. దీనితో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటిని సకాలంలో చికిత్స చేయకపోతే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు రావచ్చు…

-ఊపిరితిత్తుల క్యాన్సర్
-గుండె వ్యాధి
-పక్షవాతం
-ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధులు
-మధుమేహం
-COPD
-ఎంఫిసెమా
-TB వ్యాధి
-కంటి వ్యాధులు
-రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
-ఆర్థరైటిస్
-అథెరోస్క్లెరోసిస్

కొందరిలో అథెరోస్క్లెరోసిస్ కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే గుండె రక్త నాళాలలో పెద్ద మొత్తంలో కొవ్వు నిల్వలు స్ట్రోక్ లేదా గుండె జబ్బులకు దారితీయవచ్చని అర్థం. సిగరెట్లు ఆరోగ్యానికి చాలా హానికరం కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటం మంచిది. మీరు ఒకేసారి ఆపలేకపోతే, క్రమంగా తగ్గించండి.