Site icon HashtagU Telugu

Boiled Egg: ప్రతిరోజు ఉడకబెట్టిన కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 30 Jul 2024 06 07 Pm 6969

Mixcollage 30 Jul 2024 06 07 Pm 6969

కోడిగుడ్డు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. వైద్యులు కూడా ప్రతీ రోజు కోడిగుడ్డు తినమని చెబుతూ ఉంటారు. గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొందరు పచ్చి కోడి గుడ్డు తింటే మరి కొంతమంది ఉడకబెట్టిన కోడి గుడ్డు తింటూ ఉంటారు. మరి ప్రతిరోజు ఉడకపెట్టిన కోడిగుడ్డు తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కంటిచూపు సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఉడకపెట్టిన కోడి గుడ్డు తినడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయట.

ఉడకబెట్టిన కోడి గుడ్డులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయట. అదేవిధంగా మెదడు ఆరోగ్యానికి కూడా గుడ్లు ఎంతో బాగా ఉపయోగపడతాయి. కోడిగుడ్డులో మెదడును ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయట. ప్రతీ రోజు ఉదయాన్నే ఉడకబెట్టిన కోడిగుడ్లు తినడం వల్ల ఎంతో ఎనర్జిటిక్ గా ఉండడంతోపాటు శరీరానికి కావలసిన కేలరీలు కూడా అందుతాయట. అలాగే కోడిగుడ్డు మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుందట. అలాగే ప్రస్తుత రోజుల్లో చాలా మంది గుండె జబ్బుల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

కాబట్టి అలాంటి వారు ప్రతీ రోజూ ఒక గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. అదేవిధంగా గుడ్లు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముకలను, దంతాలను బలంగా చేస్తుందని, ఎముకలు, దంతాల సమస్యల ప్రమాదాలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే గుడ్డు శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుందట. గుడ్డులో ఉండే విటమిన్ బి2, విటమిన్ బి12, ఐరన్, ట్రిప్టోఫాన్, కోలిన్ లు డిప్రెషన్ ను తగ్గిస్తాయని చెబుతున్నారు. కోడి గుడ్డు జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుందట.