Site icon HashtagU Telugu

Quit Alcohol: ఆల్కహాల్ సడన్ గా మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Alcohol Side Effects

Alcohol Side Effects

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా చాలామంది మద్యం సేవించడం ఆపరు. ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా మద్యం సేవిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే చిన్న వయసులోనే ఆల్కహాల్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. మరి ముఖ్యంగా సిటీలో ఉన్న పిల్లలు పార్టీ కల్చర్ కి బాగా అలవాటు పడిపోయి చిన్న వయసులోనే ఈ మధ్య అలవాటును నేర్చుకున్నారు. అయితే కొంతమంది చాలా రకాల కారణంగా ఉన్నఫలంగా మద్యం తాగడం మానేస్తూ ఉంటారు. మద్యం తాగడం మానేయడం మంచిదేనా? ఒక్కసారిగా మద్యం మానడం మానేస్తే ఏం జరుగుతుందో,ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒక్కసారిగా ఆల్కహాల్ తీసుకోవడం లేదా తగ్గించడం లేదా వదులుకోవడం ఇలాంటివి చేస్తే శరీరంలోని అధిక రక్తపోటును పూర్తిగా తొలగిపోతుందట. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు స్థాయి పెరుగుతుంది. ఇది గుండె వైఫల్యానికి దారితీస్తుందట. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. అయితే ఒకేసారి పూర్తిగా మానేయకుండా, కొద్ది కొద్దిగా అలవాటుకు దూరం కావాలి. కాలేయం సహాయంతో శరీరంలోని విష పదార్థాలను సులభంగా నిర్విషీకరణ చేయవచ్చు. కానీ అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ , అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.

అటువంటి పరిస్థితిలో, మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ ఆల్కహాల్ తీసుకోవడం మెదడు, ఏకాగ్రత సమస్యలను కలిగిస్తుంది. ఇది ఒక వ్యక్తిపని సామర్థ్యం , నాణ్యతను ప్రభావితం చేస్తుందట. ఆల్కహాల్ తీసుకోకపోవడం వల్ల శరీరంలోని హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. మద్యపానాన్ని ఆకస్మికంగా నిలిపివేయడం ఆల్కహాల్ ఉపసంహరణ సిండ్రోమ్‌కు దారి తీస్తుంది. అధిక మద్యపానం శారీరక , మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.

ఆల్కహాల్ రోజువారీ వినియోగం ఒత్తిడిని పెంచుతుంది. శరీరంపై స్వీయ నియంత్రణను తగ్గిస్తుంది. హఠాత్తుగా మద్యపానం మానేసిన వ్యక్తులు ఆల్కహాల్ ఉప సంహరణ సిండ్రోమ్‌ కు గురవుతారు. ఒకవేళ ఆకస్మాత్తుగా మద్యం సేవించడం మానేస్తే విపరీతంగా చెమటలు పట్టడం, హృదయ స్పందన రేటు పెరగడం, భయాందోళన, తలనొప్పి, వాంతులు, ఆందోళన, అధిక రక్తపోటు పోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మద్యం ని మానేయాలి అనుకున్న వారు నెమ్మదిగా నెమ్మదిగా మానేయడం మంచిది.

Exit mobile version