ప్రస్తుత ప్రజల్లో చాలామందికి ఆరోగ్యం విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏది పడితే అది బయట ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్డు తిని చిన్న వయసులోనే లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. బయట దొరికే రకరకాల డ్రింక్స్ ని తాగేస్తూ ఉంటారు. అవి ఆ క్షణం టేస్టీగా అనిపించినప్పటికీ క్రమంగా అవి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయట. వాటి కారణంగా 100 రూపాయలతో పోయేది లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి ముఖ్యంగా కూల్ డ్రింక్స్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట. ఇది లివర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. కాలేయం సరైన విధంగా పని చేస్తేనే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. టాక్సిన్స్ ని ఫిల్టర్ చేయడంలో లివర్ చాలా కీలకంగా పని చేస్తుంది.
అయితే తరచూ కొన్ని హానికరమైన డ్రింక్స్ తీసుకోవడం వల్ల కాలేయ పని తీరు నెమ్మదిస్తుందట. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయి జబ్బులు వస్తాయట. లివర్ పాడైపోయిందంటే తీవ్ర అలసట, చర్మంపై దద్దుర్లు, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. సోడా.. చాలా మందికి బయట సోడా తాగే అలవాటు ఉంటుంది. నిమ్మకాయ సోడా, ఖాళీ సోడా అంటూ రకరకాల సోడాలు తాగుతూ ఉంటారు. సోడాలు తరచుగా తాగితే మాత్రం లివర్ పాడైపోతుందట. సోడాల్లో యాడెడ్ షుగర్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ఈ షుగర్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుందట. బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని ఈ కారణంగా ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీస్తుందని,ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అని చెబుతున్నారు.
అలాగే ఎక్కువ మంది తాగే మరొక డ్రింక్ ఆల్కహాల్. ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు వారు కూడా ఈ ఆల్కహాల్ కి అలవాటు పడిపోయారు. మితి మీరి ఆల్కహాల్ తీసుకుంటే లివర్ లో కొవ్వు పేరుకు పోతుందట. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తలెత్తే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. దీంతో పాటు ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందట. ఈ కారణంగా లివర్ లో మంట వస్తుందని, ఫైబ్రాసిస్ అనే కండీషన్ తలెత్తి లివర్ లో ప్రొటీన్ పెరుగుతుందని ఇక ఇది తీవ్రమైతే లివర్ సిరాసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే ఎనర్జీ డ్రింక్స్ కి కూడా దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. ఈ డ్రింక్స్ ఇన్స్టంట్ గా ఎనర్జీని ఇచ్చినప్పటికీ, ఇది నెమ్మదిగా ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. వీటిలో అధిక మొత్తంలో టౌరిన్, కెఫైన్ ఉంటాయి. వీటిని ఫిల్టర్ చేసే క్రమంలో లివర్ పై తీవ్ర ఒత్తిడి పడుతుందట. పరిమితికి మించి తాగితే పూర్తిగా లివర్ డ్యామేజ్ అవుతుందట. కొన్ని సార్లు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వరకూ వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చని చెబుతున్నారు.