ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది యువత, పిల్లలు ఎక్కువగా ఇష్టపడే జంక్ ఫుడ్స్ లో పిజ్జా కూడా ఒకటి. ఈ పిజ్జా లలో అనేక రకాల పిజ్జాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధమైన ఫ్లేవర్ ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే పిజ్జాలు తినడం మంచిదే కానీ శృతి మించి తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. పిజ్జాలు ఎక్కువగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పిజ్జాని ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..పిజ్జా తిన్న తరవాత మొదటి పది నిముషాల నుంచి నాలుగైదు గంటల వరకూ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయట.
కార్బొహైడ్రేట్స్ విపరీతంగా పెరగడంతో పాటు పూర్తిగా అరిగేంత వరకూ చాలా సమయం పడుతుందట. పైగా జీర్ణ ప్రక్రియ కూడా మందగిస్తుందని చెబుతున్నారు. ఒక్క స్లైస్ తింటేనే జీర్ణ ప్రక్రియపై ఒత్తిడి పడుతుందట. ఇక పిజ్జా మొత్తం తినేస్తే అది అరగడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. టేస్ట్ కోసం కేవలం ఒక్క స్లైస్ తో ఆపేస్తే సరిపోతుందిని, మీరు ఈ క్వాంటిటీని పెంచుకుంటూ పోయే కొద్దీ నష్టం అలాగే అనారోగ్య సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. అందుకే వారానికి ఓసారి తిన్నా అది అనారోగ్యకరమే అంటున్నారు. రెగ్యులర్ గా తింటే ఎన్నో జబ్బులు వస్తాయట. ఒక్కసారి కేలరీలు పెరిగితే క్రమంగా కొవ్వు పేరుకుపోతుందని, దాంతో కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ దీర్ఘకాలిక రోగాల ముప్పు పెరుగుతుందని, ముఖ్యంగా డయాబెటిస్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది అని చెబుతున్నారు.
అలాగే పిజ్జాలో అధిక మొత్తంలో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి క్రమంగా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయట. అలాగే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని, వారానికి రెండు మూడు సార్లు కనీసం రెండు స్లైస్ లు తిన్నా అనారోగ్యాలు తప్పవు అని చెబుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందట. అందుకే ఎప్పుడో ఒక సారి రుచి కోసం మాత్రమే తినాలని, రెగ్యులర్ గా పిజ్జా తింటే మాత్రం కచ్చితంగా జబ్బుల బారిన పడడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిజ్జాలు ఎక్కువగా తింటే విపరీతంగా బడుగు పెరిగిపోవడం ఖాయం అని చెబుతున్నారు. విపరీతమైన బరువు కారణంగా స్థూలకాయం అధిక బరువు వంటి సమస్యలు వస్తాయట. అధిక కొవ్వు కేలరీలున్న పిజ్జాని రెగ్యులర్ గా తింటే కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందట. అలాగే మలబద్ధకానికి దారి తీయడంతో పాటు క్యాన్సర్ కలిగించే ముప్పు ఉందట. అందుకే చాలా మితంగా తినాలని, రుచిగా ఉందని రెగ్యులర్ గా తినడం మానేయాలని చెబుతున్నారు.