మీ గోళ్లపై నల్లటి చారలు ఏర్ప‌డుతున్నాయా?

డాక్టర్ సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Black Lines On Nails

Black Lines On Nails

Black Lines On Nails: గోళ్లపై నల్లటి చారలు ఏర్పడటాన్ని ‘మెలనోనిచియా’ అని పిలుస్తారు. గోరు కింద మెలానిన్ పిగ్మెంట్ పేరుకుపోవడం వల్ల ఇది సంభవిస్తుంది. దీనివల్ల గోరుపై నలుపు లేదా గోధుమ రంగు గీతలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇది ప్రమాదకరం కాకపోయినా మరికొన్ని సార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఒకవేళ మీ గోళ్లపై కూడా ఇటువంటి నల్లటి చారలు కనిపిస్తే దానికి గల కారణాలు, పరిష్కారాలను ఇక్కడ తెలుసుకోండి.

గోళ్లపై నల్లటి-గోధుమ రంగు చారలు రావడానికి కారణాలు

చర్మ రంగు: మీ చర్మం నలుపు లేదా డార్క్ కలర్‌లో ఉంటే సహజంగానే మెలనోనిచియా వచ్చే అవకాశం ఉంటుంది.

గర్భధారణ: గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల చర్మం రంగు మారుతుంది. దీని ప్రభావం గోళ్లపై కూడా పడి చారలు రావచ్చు.

ఇన్ఫెక్షన్లు: ఫంగల్, బ్యాక్టీరియల్ లేదా హెచ్‌ఐవి, హెచ్‌పివి వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా గోళ్లపై గుర్తులు ఏర్పడతాయి.

వాపు: కొన్ని చర్మ వ్యాధుల వల్ల గోరు చుట్టూ ఉండే చర్మం వాపుకు గురవుతుంది. ఇది మెలనోనిచియాకు దారితీస్తుంది.

పోషకాహార లోపం: శరీరంలో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు గోళ్లపై నల్లటి గీతలు లేదా మచ్చలు కనిపిస్తాయి.

గాయాలు: కాళ్లకు చాలా టైట్‌గా ఉండే షూస్ ధరించడం వల్ల కాలి గోళ్లపై, అలాగే గోళ్లు కొరకడం లేదా లాగడం వంటి అలవాట్ల వల్ల చేతి గోళ్లపై నల్లటి గీతలు పడవచ్చు.

చర్మ వ్యాధులు: సోరియాసిస్, క్రానిక్ రేడియో డెర్మటైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు గోళ్లు రంగు మారుతుంటాయి.

ట్యూమర్: కొన్ని రకాల క్యాన్సర్లు లేదా ట్యూమర్లు గోరు లోపల కణజాలాన్ని దెబ్బతీసి నల్లటి గుర్తులు రావడానికి కారణమవుతాయి.

Also Read: మూసీ పునర్జన్మ.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త విజన్!

ఈ సమస్యను ఎలా దూరం చేయాలి?

గోళ్లపై గీతలు రావడానికి గల అసలు కారణాన్ని ముందుగా గుర్తించడం ముఖ్యం. దాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి.

గోరుకు గాయమైతే అది తగ్గే వరకు వేచి చూడాలి.

ఇన్ఫెక్షన్ ఉంటే సంబంధిత మందులు వాడాలి.

గర్భధారణ వల్ల వచ్చిన మార్పులు ప్రసవం తర్వాత సహజంగానే తగ్గిపోతాయి.

విటమిన్ లోపాన్ని ఎలా అధిగమించాలి?

గోళ్లపై చారలు విటమిన్ లోపం వల్ల వస్తుంటే, ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

విటమిన్ బి12 & డి: వీటి లోపాన్ని తగ్గించడానికి పాలు, గుడ్లు, పుట్టగొడుగులు, చేపలను మీ డైట్‌లో చేర్చుకోండి.

సూర్యరశ్మి: తగినంత ఎండ తగిలేలా చూసుకోండి (విటమిన్ డి కోసం).

సప్లిమెంట్లు: డాక్టర్ సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్లు లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

  Last Updated: 03 Jan 2026, 03:07 PM IST