దిండుపై త‌ప్పుగా ప‌డుకుంటున్నారా?!

గాఢ నిద్ర లేకపోతే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాపు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, బీపీ పెరగడానికి దారితీస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Pillow

Pillow

Pillow: తప్పు దిండు ఉపయోగించి పడుకోవడం వల్ల కేవలం తల లేదా మెడ నొప్పి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సర్వైకల్ సమస్యల నుండి హై బ్లడ్ ప్రెషర్ వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు మనం వాడే దిండు కారణం కావచ్చు. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు తెలిపారు. సరైన దిండును ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తప్పు దిండుపై పడుకోవడం వల్ల కలిగే నష్టాలు

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. తప్పు దిండు వాడటం వల్ల శరీరానికి కలిగే నష్టాలు ఇవే.

సర్వైకల్ సమస్యలు: దిండు సరిగ్గా లేకపోతే సర్వైకల్ నరాల అమరిక దెబ్బతింటుంది. దీనివల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి, నరాలు నొక్కుకుపోతాయి.

రక్త ప్రసరణ: మెడ వైపు రక్త ప్రసరణకు ఆటంకం కలిగి, గాఢ నిద్ర పట్టదు. గాఢ నిద్రలో మాత్రమే శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు: గాఢ నిద్ర లేకపోతే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాపు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, బీపీ పెరగడానికి దారితీస్తుంది.

నిద్రలేమి: దాదాపు 70% నిద్ర సంబంధిత సమస్యలకు తప్పు దిండు, పడకయే కారణమని పేర్కొన్నారు.

Also Read: ఏ కారు కొంటే మంచిది?!

సరైన దిండును ఎలా ఎంచుకోవాలి?

ఎత్తు: దిండు ఎత్తు ఎంత ఉండాలంటే మెడ, వెన్నెముక ఒకే సరళరేఖలో ఉండాలి.

ఫోమ్ దిండు: మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా లేని ఫోమ్ దిండులను ఎంచుకోవడం మంచిది.

కవర్: కాటన్ దిండుకు కాటన్ కవర్‌నే వాడండి. ఇది సౌకర్యంగా ఉండటమే కాకుండా గాలి ఆడేందుకు సహకరిస్తుంది.

సైజ్: పడుకునే పద్ధతిని బట్టి దిండు పరిమాణం ఉండాలి. మీరు నేరుగా పడుకుంటే పలచటి దిండును, ఒక పక్కకు పడుకుంటే కొంచెం లావుగా ఉండే దిండును వాడటం ఉత్తమం.

దిండును ఎప్పుడు మార్చాలి?

ప్రతి 2 నుండి 3 ఏళ్లకు ఒకసారి మీ దిండును మార్చాలి లేదా అందులో దూదిని/ఫోమ్‌ను మళ్ళీ నింపుకోవాలి. ఎక్కువ కాలం ఒకే దిండును వాడితే దాని ఆకారం మారుతుంది. దీనివల్ల అది మెడకు తగిన సపోర్ట్ ఇవ్వదు. అంతేకాకుండా పాత దిండ్లు బ్యాక్టీరియాకు నిలయంగా మారే ప్రమాదం ఉంది.

  Last Updated: 06 Mar 2026, 09:49 PM IST