Pregnancy: గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తీసుకోవలసిన ఆరు పోషకాలు ఇవే?

పెళ్లి అయిన ప్రతి ఒక్క స్త్రీ కూడా మాతృత్వం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటుంది. మహిళలకు తల్లి అవ్వడం

  • Written By:
  • Publish Date - March 15, 2023 / 06:30 AM IST

పెళ్లి అయిన ప్రతి ఒక్క స్త్రీ కూడా మాతృత్వం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటుంది. మహిళలకు తల్లి అవ్వడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పవచ్చు. ఇకపోతే సాధారణంగా మహిళలు మామూలు సమయాలతో పోల్చుకుంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటారు. తినే తిండి విషయంలో నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చేసే ప్రతి ఒక పని కూడా కడుపులోని బిడ్డ పై పడుతుంది. అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇష్టమైన ఫుడ్ ని కూడా తీసుకోవాలి.

ఆ సమయంలో చిరాకుగా ఉండటం వల్ల ఇష్టమైన ఫుడ్ కూడా తినడానికి ఇష్టపడరు. ఎంతో ఇష్టమైన ఫుడ్ కూడా చూసినప్పుడు వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఆరు రకాల పోషకాలు తీసుకోవడం వల్ల తల్లికి అలాగే గర్భంలో ఉండే శిశువుకి ఇద్దరికీ కూడా చాలా మంచిది. మరి ఆ ఆరు పోషకాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రినాటల్ విటమిన్స్ కావాల్సిన పోషకాలు అందిస్తాయి. నాన్ వెజ్ తినని వారు విటమిన్ల లోపం రాకుండా విటమిన్ టాబ్లెట్స్ ను వాడమని వైద్యులు సూచిస్తూ ఉంటారు.

కాగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఐరన్, కాల్షియం, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, అయోడిన్, డిహెచ్ఏ వంటి ఆరు పోషకాలు తప్పకుండా తీసుకోవాలి. తల్లి ఆరోగ్యం బాగుండాలి అన్న నాకు ఈ కడుపులోని శిశువు అన్ని పార్ట్స్ పెరిగి సరైన స్థాయిలో రక్తం ఉండాలి అన్న కూడా ఇవన్నీ తీసుకోవాలి. ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ బయట దొరికే పాస్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా మంచి మంచి ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఏదైనా సందేహం ఉన్నప్పుడు వెంటనే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.