Gerd: తిన్న ఆహారం జీర్ణమవ్వక పుల్లని త్రేన్పులు వస్తున్నాయా.. ఈ సమస్య ఉందేమో..

ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా చాలామంది గ్యాస్ ట్రబుల్ జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ గ్యాస్ ట్రబుల్, జీర

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 09:35 PM IST

ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా చాలామంది గ్యాస్ ట్రబుల్ జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ గ్యాస్ ట్రబుల్, జీర్ణ సమస్యల కారణంగా తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక పుల్లటి తీన్పులు వస్తున్నాయి అని చాలామంది చెబుతూ ఉంటారు. కొంతమందిని ఈ పుల్లటి త్రేన్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి కారణంగా గొంతు మంట సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇండియాలో 20 నుంచి 30 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులోని యాసిడ్స్ అన్నవాహికలోకి వచ్చినప్పుడు ఈ సమస్య వస్తుంది.

దీని వల్ల అన్నవాహిక లైన్ ఇబ్బందిగా మారి అనేక సమస్యల్ని కలిగిస్తుంది. ఛాతీలో మంట, తిన్న తర్వాత ఉంటుంది. అలాగే రాత్రి పడుకున్నప్పుడు ఛాతీ మంట ఎక్కువగా ఉంటుంది. ఆహారం, పుల్లని ద్రవం నోటిలోకి వస్తుంటుంది. పై కడుపు, ఛాతీలో నొప్పి మింగడంలో ఇబ్బంది. గొంతులో అన్నం ఉన్న అనుభూతి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దవడ, చేయి నొప్పి వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఛాతీలో మంటగా అనిపిస్తుంది. ఛాతీ నుండి పై వరకూ గొంతు మొత్తం మంటగా ఉంటుంది. కడుపు నుండి యాసిడ్స్ అన్నవాహిక లైనింగ్ వరకు తిరిగి కదులుతున్నప్పుడు ఇది జరుగుతుంది.

కొన్ని నిమిషాల నుండి గంటల వరకూ ఇది అలానే ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే జీర్ణ కాని ఆహారం కడుపులోని ఆమ్లంతో కలిసి తిరిగి కడుపు నుండి అన్నవాహికకు వెళ్తుంది. దీనిని రెగర్జిటేషన్ అంటారు. ఇది మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో నోటిలో పుల్లని రుచి అనిపిస్తుంది. ఎక్కువగా తినడం. తిన్న వెంటనే వర్కౌట్ చేయడం, వంగడం వంటివి చేసినప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది. ఆహారం మింగడం ఇబ్బందిగా ఉంటుంది. ఆహారం గొంతు, ఛాతీలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీనినే డైస్ఫాగియా అంటారు. ఎసోఫాగియల్ కణజాలాలకు రిఫ్లక్స్ వల్ల కలిగే నష్టంతో ఇది ఏర్పడుతుంది. దీని వల్ల ఆహారం మింగడం కష్టంగా మారుతుంది. కడుపులో ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. ఇది ట్యూబ్ లైనింగ్, స్వర తంతువులని చికాకు పెడుతుంది. గొంతు నొప్పి, పొడి దగ్గు, గురక ఇవన్నీ కూడా ఈ సమస్య వల్ల వస్తుంది.