Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి..? లక్షణాలు ఏలా ఉంటాయి..?

బ్లడ్ క్యాన్సర్...ఈ మహమ్మారితో ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చికిత్స విధానం అందుబాటులోకి వచ్చినా....పూర్తిగా నయం చేయలేకపోతున్నాం.

  • Written By:
  • Publish Date - March 25, 2022 / 09:30 AM IST

బ్లడ్ క్యాన్సర్…ఈ మహమ్మారితో ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చికిత్స విధానం అందుబాటులోకి వచ్చినా….పూర్తిగా నయం చేయలేకపోతున్నాం. క్యాన్సర్ ఎన్నోరకాలుగా ఉన్నప్పటికీ ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్నవాటిలో ఒకటి. బ్లడ్ క్యాన్సర్ సోకిన వారిలో తెల్ల రక్తకణాల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. దాంతో రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ప్లేట్ లెట్స్ పూర్తిగా తగ్గిపోతాయి. దీంతో వారి చర్మంపై దద్దుర్లు, గాయాలైనప్పుడు రక్తం ఎక్కువగా కారడం జరుగుతుంది.

బ్లడ్ క్యాన్సర్ సోకిన వారి శరీరంలో రక్తకణాలు ఉత్పత్తి చాలా దెబ్బతింటుంది. దీంతో కొన్ని రకాల కణాలు విపరీతంగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా కణ సమూహాలుగా ఏర్పడతాయి. దీనిని క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ ఎముక మజ్జ భాగంలోనే ప్రారంభం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇక్కడే క్యాన్సర్ మూలకణాలు ఏర్పడి…అవి పెరిగి తెల్ల రక్తకణాలు, ఎర్రరక్తకణాలు కాస్త ప్లేట్ లెట్స్ గా రూపాంతరం చెందుతాయి. బ్లడ్ క్యాన్సర్ సోకిన వారిలో తెల్లరక్తకణాల సంఖ్య విపరీతంగా పెరిగి..ఎర్రరక్త కణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. తెల్లరక్తకణాలు విపరీతంగా పెరగడంతో ఇతర కణాలు పనిచేయవు. ఎందుకంటే తెల్లరక్తకణాలు మిగతా వాటిపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో రోగనిరోధకశక్తి పూర్తి తగ్గుతుంది.

బ్లడ్ క్యాన్సర్ మూడు రకాలు…లుకేమియా, లింఫోమా, మైలోమా…
లక్షణాలు…
* బ్లడ్ క్యాన్సర్ సోకినవారికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు విపరీతంగా రక్తం కారుతుంది. దీనికి కారణం రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్ లెట్స్ తగ్గిపోవడం. చర్మం దద్దుర్లు ఏర్పడతాయి. అయితే ఈ లక్షణాలన్నీ కూడా రోగం ముదిరికానే బయటపడతాయి.
*తరచుగా అలసిపోవడం, ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, తరచుగా జ్వరం రావడం…ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు.
* సడెన్ గా బరువు తగ్గడం, రాత్రి పడుకున్నప్పుడు చెమటలు విపరీతంగా రావడం, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతుండటం.
వీటన్నింటితోపాటుగా ఎర్రరక్తకణాలు తగ్గడం వల్ల రక్తహీనత సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ఆక్సిజన్ సరిగ్గా అందక…ఆయాసం వస్తుంది. ఎముకల నొప్పి విపరీతంగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపించినట్లయితే…వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.