Fruits: పండ్లు తిన్న తర్వాత నీళ్ళు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తెలుసుకోవడంతో పాటు పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 09:15 PM IST

ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తెలుసుకోవడంతో పాటు పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిరోజు పండ్లు తినడం వల్ల ఆరోగ్యం బాగా ఉండటంతో పాటు శరీరానికి కావలసిన విటమిన్లు పోషకాలు అందుతాయి. పండ్లు మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. వీటిలో క్యాలరీలు, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్‌ తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కానీ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి పండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు? ఒకవేళ తాగితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇలా పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మందగించి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పండ్లలో చక్కెర, ఈస్ట్‌ ఎక్కువగా ఉంటుంది. పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే, కడుపులో ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు ప్రశాంతంగా ఉంటాయి. కడుపులో కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్స్‌‌ ఉత్పత్తి అవుతాయి. దీని కారణంగా గ్యాస్ట్రిక్‌‌‌‌ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఫ్రూట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. పుచ్చకాయ, కర్బూజా, కీరా, నారింజ , స్ట్రాబెర్రీ తిన్న తర్వాత నీళ్లు తాగితే శరీరంలోని జీర్ణవ్యవస్థను దెబ్బతీసేలా చేస్తాయి. పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ లోని pH స్థాయి మారుతుంది. దాంతో కడుపులో యాసిడ్స్‌ తక్కుగా విడుదల అవుతాయి. పండ్ల లోని నీటి పరిమాణం, పండ్లు తిన్న తర్వాత మనం త్రాగే నీటి పరిమాణం జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.

ఇది గ్యాస్ట్రిక్, ఎసిడిటీని పెంచుతుంది. పండ్లు తిన్న తర్వాత ఒక గంట వరకు నీళ్లు తాగకూడదు. పండు తిన్న వెంటనే నీరు త్రాగితే కడుపులోని జీర్ణ రసాలు పలుచగా అవుతాయి. దీనికారణంగా కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే.. జీర్ణవ్యవస్థ క్రమంగా మందగిస్తుంది. జీర్ణం కాని ఆహారం చాలా వరకు కడుపులో మిగిలిపోతుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇది ఇన్సులిన్‌ బ్యాలెన్స్‌ను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్‌, ఊబకాయం ముప్పు పెరుగుతుంది.