Custard Apple: శీతాకాలంలో లభించే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. ఈపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.
పండ్లలో సీతాఫలం అనేక పోషకాలకు నిలయం అని చెప్పాలి. ఈ పండు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే దీనిని ఎక్కుగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, వాంతులు వంటి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా వీటి విత్తనాలు చాలా విషపూరితమైనవని చెబుతున్నారు.
కాబట్టి వాటిని తినేముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు సీతాఫలం తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొంతమందికి సీతాఫలం తిన్న తర్వాత దురద, దద్దుర్లు, చికాకు లేదా ఇతర అలెర్జీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి లక్షణాలు కనిపిస్తే, సీతాఫలం తినడం మానేయడం మంచిదని చెబుతున్నారు. అలాగే సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
కాబట్టి దానిని ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు లేదా కడుపు నిండిన భావన వంటి జీర్ణ సమస్యలు వస్తాయట. కాగా సీతాఫలం గుజ్జు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దాని విత్తనాలు చాలా విషపూరితమైనవి. కాబట్టి పండ్లను తినేటప్పుడు, విత్తనాలను తొలగించి, వాటిని మింగకుండా జాగ్రత్త వహించాలట. సీతాఫలం ఐరన్ మంచి మూలం. అయితే ఐరన్ అధికంగా తీసుకుంటే, అది శరీరంలో ఇనుము స్థాయిలను పెంచుతుందట. ఫలితంగా కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, కడుపు పొర, వాపు, పూతల వంటి సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. సీతాఫలం పోషకాలకు నిలయం, ఇందులో విటమిన్ సి, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ను తొలగించడం ద్వారా శరీరాన్ని రక్షిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
Custard Apple: మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే సీతాఫలం అస్సలు తినకండి!

Custard Apple