కొబ్బరిపువ్వు.. ప్రతీ ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. దీనిని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. అయితే కొబ్బరిలో కొబ్బరి పువ్వు ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయి. అయితే పల్లెటూరికి వెళ్ళినప్పుడు ప్రత్యేకించి రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటారు. ఈ కొబ్బరి పువ్వును కూడా ప్రత్యేకంగా అమ్మడం జరుగుతుంది. అయితే భారత దేశంలో కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మనకు కొబ్బరి పువ్వు ఎక్కువగా కనిపిస్తుంది. కేరళలో కొబ్బరి పువ్వు ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి పంటలు ఎక్కువగా ఎక్కడ ఉన్నా అక్కడ కొబ్బరి పువ్వు మనకు కనిపిస్తుంది. ఈ కొబ్బరి పువ్వులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పువ్వు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందిస్తుంది.
అయితే మరి కొబ్బరి పువ్వు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి పువ్వులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు కలిగి ఉంటాయ్. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ ఈ లను సమృద్ధిగా కలిగి ఉంటుంది. అలాగే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి పువ్వులో ఉన్న మధ్యమ గొలుసు ట్రైగ్లిసెరైడ్లు ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణించబడతాయి. ఇవి శరీరంలో చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, మెటబాలిజాన్ని కూడా వేగవంతం చేయడంలో సహాయపడుతుందట. కొబ్బరి పువ్వులో ఉండే లౌరిక్ ఆమ్లం శరీరానికి యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను అందిస్తుంది.
ఇది ఇమ్మ్యూనిటీని పెంపొందించడంలో, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, మలబద్ధకం సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన సులభంగా జీర్ణమవుతుంది. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఇవి ఇన్‌స్టాంట్ ఎనర్జీని అందించి, ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. కొబ్బరి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది చర్మంలో తేమను నిలుపుకోవడానికి, వృద్ధాప్య ఛాయలను, ముడతలను తగ్గించడానికి, ఇతర చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వులో ఉండే కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో, ఘ్నాపక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే న్యూరో డిజెనరేటివ్ వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. ఈ కొబ్బరి పువ్వును వర్కౌట్ చేసే ముందు తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. దీని వల్ల వర్కౌట్ మరింత బాగా చేయడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు.