Site icon HashtagU Telugu

Tomato Juice: టమోటా జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tomato Juice

Tomato Juice

మన వంటింట్లో దొరికే కాయగూరలలో టమోటా కూడా ఒకటి. టమోటా లేకుండా చాలా రకాల వంటలు పూర్తి కావు. టమోటా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. టమోటాలు తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. టమోటా జ్యూస్ వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. మరి టమోటా జ్యూస్ ని తాగితే ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టమాటను ప్రతి రోజూ భోజనంలో భాగం చేసుకోవాలి. ఉదయమే టమాట రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమట జ్యూస్‌ తో గుండె జబ్బులు రాకుండా వుండడమే కాదు క్యాన్సర్‌ ను కూడా నివారిస్తుంది.

టమాటల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, వైటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. టమాటలో వుండే లైసోపీన్, వైటమిన్ ఈ, గుండె సంబంధిత రోగాలు రాకుండా చేస్తాయట. ప్రతి రోజూ పాలు తాగినట్టే ఈ టమాట జ్యూస్‌ ను తాగితే చాలా ఆరోగ్యవంతంగా వుంటామట. ప్రతిరోజూ టమాట జ్యూస్‌ను తాగితే చాలా రకాల క్యాన్స్‌ర్ లు నయం అవుతాయట. టమాట జ్యూస్ తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్స్ రిస్క్ తగ్గే అవకాశం వుందట. స్కిన్ క్యాన్సర్ కూడా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. టమాట జ్యూస్ ‌కు గుండె ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. కాగా టమాటలో వుండే లైసోపీన్, బీటా కెరోటీన్ బ్లడ్ ప్రెజర్‌ ను, కొలెస్ట్రాల్‌ ను అదుపులో ఉంచుతుంది.

టమాట వల్ల శరీరంలో కొవ్వు కూడా కరుగుతుందని తేలింది. పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు టమాట జ్యూస్‌ లో లైసోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి అన్న విషయం మనకు తెలిసిందే. ఒక గ్లాసు టమాట జ్యూస్‌ లో 22 మిల్లీ గ్రాముల లైపోపీన్ ఉంటుందట. అలాగే డ్యామేజ్ అయిన సెల్స్‌ ను రిపేర్ చేసే లక్షణం లైసోపీన్‌ లో ఉంటుందట. టమాటలో ప్రొటీన్లు పుష్కలంగా వుంటాయట. టమాటలో ప్రొటీన్లు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. రోజూ ఒక కప్పు టమాట జ్యూస్ తాగితే శరీరానికి అవసరమైన వైటమిన్ సి పుష్కలంగా లభిస్తుందట. ఒక గ్లాసు టమాట జ్యూస్‌ లో ఒక్కరోజుకు అవసరమయ్యే వైటమిన్ ఏ 20 శాతం ఉంటుందట. క్యారటినాయిడ్స్, పాలిఫినాల్స్ టమాటలో క్యారటినాయిడ్లు, పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. క్యారటినాయిడ్లు వైటమిన్ ఏగా మార్చబడతాయట. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుందట.