Site icon HashtagU Telugu

Corn: మొక్కజొన్న వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Mixcollage 30 Jun 2024 07 13 Pm 3769

Mixcollage 30 Jun 2024 07 13 Pm 3769

మొక్కజొన్న.. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తింటూ ఉంటారు. మరి ముఖ్యంగా వర్షాకాలంలో చల్లని క్లైమేట్ అప్పుడు వీటిని ఉడకబెట్టుకొని లేదంటే కాల్చుకొని తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మొక్కజొన్నలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నతో చేసిన ఆహార పదార్థాలు తిన్నా మంచిదే. చాలామంది ఈ మొక్కజొన్నతో అనేక రకాల ఆహార పదార్థాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ మొక్కజొన్న కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి.

ఇవి దేహంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడతాయి. రక్తహీనత ముప్పు రాకుండా తగిన మోతాదులో న్యూట్రియంట్లను సరఫరా చేయడంలో మొక్కజొన్న సహాయపడుతుంది. మొక్కజొన్నను కంకులుగా వున్నప్పుడే వాటిని తినేయవచ్చు లేదా మసాలాలు, కారాలు కూడా తగిలించి తినవచ్చు. మొక్కజొన్న ఉడకబెట్టుకొని లేకుంటే కాల్చుకొని వాటికి కాస్త ఉప్పు నిమ్మరసం తగిలించి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మెుక్కజొన్నలో లినోలిక్‌ ఆసిడ్, విటమిన్‌ ఇ, బి1, బి6, నియాసిన్, రైబోఫ్లోవిన్‌ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.

వీటికి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉంటుంది. అథ్లెటిక్‌ క్రీడాకారులకు, జిమ్‌లో చెమటలు చిందించేవారికి ఇది శక్తిదాయకంగా పనిచేస్తుంది. మొక్కజొన్నలో బి విటమిన్‌ కుటుంబానికి చెందిన బి1, బి5 లతో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే కార్బొహైడ్రేట్లు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుందట. మొక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. పీచు ఎక్కువుగా ఉండడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. మొక్కజొన్న తినడం వల్ల పేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ మొక్కజొన్నల్లో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. మెుక్కజొన్నలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడమే కాదు శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయి.