టీ తాగడం అందరికీ మంచిది కాదట‌.. ఎవరెవరు దూరంగా ఉండాలి?

ఒక కప్పు టీలో కేవలం అర చెంచా టీ పొడి మాత్రమే వాడినప్పుడు అది ఆరోగ్యకరంగా ఉంటుంది. పాలు వేసి బాగా మరిగించిన స్ట్రాంగ్ టీ మెదడును 'ఓవర్ స్టిమ్యులేట్' చేస్తుంది. దీనివల్ల ఆందోళన పెరుగుతుంది.

Published By: HashtagU Telugu Desk
Tea

Tea

Tea: భారతీయ ఇళ్లలో టీ వాసన ముక్కుకు తగిలే వరకు కళ్లు తెరవవు. కానీ టీ అందరికీ ప్రయోజనకరం కాదు. కొంతమందికి దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఈ విష‌యంపై ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు.

ఎవరెవరు టీ తాగకూడదు?

ఐరన్ లోపం ఉన్నవారు టీకి దూరంగా ఉండాలి. టీ శరీరంలో ఐరన్ గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి రక్తహీనత ఉన్నవారు టీకి దూరంగా ఉండాలి. అలాగే ఎముకల బలహీనత లేదా ఆస్టియోపోరోసిస్ ఉన్నవారు టీ తాగకూడదు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు టీకి దూరంగా ఉండటం మంచిది. హార్మోన్ల సమస్యలతో బాధపడే అమ్మాయిలకు టీ హానికరంగా మారుతుంది. గర్భిణీలు, అలాగే ఆందోళన, డిప్రెషన్ లేదా అధిక కోపం వచ్చే వారు టీ తాగకూడదు. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా టీని నివారించాలి.

Also Read: ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

టీ ఎప్పుడు ఆరోగ్యకరంగా మారుతుంది?

ఒక కప్పు టీలో కేవలం అర చెంచా టీ పొడి మాత్రమే వాడినప్పుడు అది ఆరోగ్యకరంగా ఉంటుంది. పాలు వేసి బాగా మరిగించిన స్ట్రాంగ్ టీ మెదడును ‘ఓవర్ స్టిమ్యులేట్’ చేస్తుంది. దీనివల్ల ఆందోళన పెరుగుతుంది. ఇందులోని టానిన్ల వల్ల బీపీ కూడా పెరగవచ్చు. అతిగా మరిగించిన టీ లివర్, కడుపు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

పాలు టీని ఆరోగ్యకరంగా మార్చడం ఎలా?

మీరు టీ లేకుండా ఉండలేకపోతే సాధారణ పాలకు బదులుగా ప్లాంట్ బేస్డ్ మిల్క్ (బాదం పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు లేదా ఓట్స్ పాలు) వాడమని డైటీషియన్ సలహా ఇస్తున్నారు. అలాగే పాలను టీతో కలిపి ఉడకబెట్టకుండా, విడివిడిగా తీసుకోవడం మంచిది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఎసిడిటీ, వికారం, ఆందోళన కలుగుతాయి. ఇది కడుపు లోపలి పొరను దెబ్బతీస్తుంది. భోజనం చేసిన వెంటనే టీ తాగితే ఆహారంలోని ఐరన్ శరీరానికి అందదు. జీర్ణక్రియ మందగించి, కడుపు ఉబ్బరం కలుగుతుంది. టీని ఎప్పుడూ అతిగా మరిగించకూడదు. ఇలా చేస్తే టానిన్లు ఎక్కువ విడుదలయ్యి చేదు పెరుగుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి.

టీ తాగే సరైన పద్ధతి

  • ఒక కప్పుకు అర చెంచా టీ పొడి మాత్రమే వాడండి.
  • ముందుగా నీటిని మరిగించి, ఆపై టీ పొడి వేసి 2-3 నిమిషాలు మాత్రమే ఉంచండి.
  • వీలైనంత వరకు పాలు లేని టీకి ప్రాధాన్యత ఇవ్వండి.
  • సాధారణ టీకి బదులుగా అల్లం-తులసి టీ, తేనె-నిమ్మకాయ టీ, అశ్వగంధ టీ లేదా కామోమైల్ టీ వంటివి ప్రయత్నించండి.
  Last Updated: 16 Dec 2025, 02:42 PM IST