వేసవికాలం మొదలు కాకముందే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో విపరీతమైన ఎండల వల్ల ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అయితే ఈ వేసవికాలంలో నీటి కుండలో చల్లనీరు తాగితే మరి కొందరు ఫ్రిజ్లో నీరు తాగుతూ ఉంటారు. గడ్డలు కట్టిన నీటిని తాగుతూ ఉంటారు. అయితే ఇలా తాగడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఎక్కువ చల్లగా ఉండే నీటిని తాగడం అంత మంచిది కాదట. మరి ఎక్కువ చల్లగా ఉండే మీరు తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండాకాలంలో ఐస్ వాటర్ తాగడం అంటే రోగాలను కొని తెచ్చుకోవడమే అని అంటున్నారు.
ఈ ఐస్ వాటర్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎక్కువ చల్లగా ఉండే నీరు తాగడం వల్ల పంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. పంటి నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. చల్లటి నీరు తాగడం వల్ల చిగుళ్లపై ప్రభావం పడుతుందట. పంటి సమస్యలతో బాధపడుతున్న వారు చల్ల నీరు దూరంగా ఉండటమే మంచిది. లేదంటే చిగుళ్ల నుంచి రక్తం కారడం, పళ్లు ఊడిపోవడం జరుగుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల వెన్నెముక నరాలు ఒక్కసారిగా చల్లబడి తలనొప్పికి దారితీస్తుందట. శరీరంలో ఒక్కసారిగా వేడి పడిపోవడం వల్ల సైనస్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందట. మెదడు పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందట. కాబట్టి చల్లటి నీరును తాగే అలవాటును తగ్గించుకోవాలి. గుండె సమస్యలు చల్లటి నీరు తాగగానే గుండెకు సంబంధించిన నాడులు ఒకే సారి చల్లబడతాయి.
దీంతో అవి చేసే రక్తప్రసరణ పనుల్లో వేగం తగ్గి హార్ట్ రేట్ తగ్గుతుందట. ఇది మొత్తం గుండె సమస్యకు దారి తీస్తుందని చెబుతున్నారు. కాబట్టి మితంగా మాత్రమే చల్లటి నీరును తాగాలి. జీర్ణక్రియలో అడ్డంకులు చల్లటి నీరు తాగడం వల్ల అది కడుపులో చేరి కడుపును ఒక్కసారిగా దగ్గరికి చేస్తుంది. కడుపులో వాతావరణం కూడా ఒక్కసారిగా మారడం, వేడి తగ్గిపోవడం వల్ల జీర్ణప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో జీర్ణ సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చల్ల నీరు జలుబు లేని వారికి జలుబు తెప్పిస్తుందట. చల్లటి నీరు తరచుగా తాగే వారికి గొంతులో మంట లేదా గొంతు సమస్యలు ఉండడం చూస్తుంటాము. కొందరిలో ముక్కు మూసుకుపోతుంది. ముక్కులో అదనపు శ్లేష్మం పేరుకుపోయి ఇబ్బందులను సృష్టిస్తుందట. కాబట్టి చల్లటి నీరు తాగే అలవాటుకి ఇక స్వస్తి పలకడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఎండాకాలంలో మనిషి రోజుకు కనీసం 3 లీటర్ల నుంచి 6 లీటర్ల నీరు తాగాలని చెబుతున్నారు. ఎండాకాలంలో డీ హైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరిగా పాటించాలి. చల్లటి నీరును ఎంత తాగినా లేని ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి సాధారణ మంచి నీటినే రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు తాగాలని చెబుతున్నారు. తాగు నీరు విషయంలో అజాగ్రత్త అస్సలు పనికి రాదు, ఎందుకంటే మన శరీరంలో 60 శాతం నీరే ఉంటుంది.