Site icon HashtagU Telugu

Plastic Items: ప్లాస్టిక్స్ టిఫిన్ బాక్స్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

Mixcollage 15 Jul 2024 10 34 Am 3905

Mixcollage 15 Jul 2024 10 34 Am 3905

ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్న కవర్ ల నుంచి పెద్ద పెద్ద సంచుల వరకు ప్రతి ఒక్క చోట ప్లాస్టిక్ వస్తువులనే వినియోగిస్తున్నారు. ఇంట్లో కూడా పిల్లలకు క్యారేజ్ కట్టి ఇవ్వడానికి అనేక వస్తువులు స్టోర్ చేసుకోవడానికి కూడా ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తున్నారు. ఫ్రిడ్జ్ వంటి వాటిలో క్లాసిక్ కంటైనర్ లనే ఉపయోగిస్తున్నారు. తాగే సీసాల నుంచి ఫుడ్ ప్యాకింగ్ బిన్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టికే కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యానికే కాదు ప్రకృతికి కూడా మంచిది కాదు.

ఇదే విషయాన్నీ అధికారులు ఎన్ని సార్లు చెప్పినా ఎంత అవగాహన కల్పించిన ప్రజలు మాత్రం ఈ ప్లాస్టిక్ వస్తువులనే వినియోగిస్తున్నారు. కాగా ప్లాస్టిక్ మన శరీరానికి హాని చేసే ఎన్నో రసాయనాలతో తయారవుతుందన్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ లో ఏ ఆహార పదార్థాలను పెట్టినా అవి కలుషితం, విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది. దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అసలు ప్లాస్టిక్ వాడకం వల్ల మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్లాస్టిక్ లో బీపీఏ అనే రసాయనం ఉంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది.

పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణం అవుతుంది. అలాగే ప్లాస్టిక్ లో థాలేట్స్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ ను ఫ్లెక్సిబుల్ గా మారుస్తుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి మాత్రం అంత మంచిది కాదు. ముఖ్యంగా పిల్లలకు అస్సలు మంచిది కాదు. ప్లాస్టిక్ టిఫిన్ లేదా బాటిళ్లలో వేడి వేడి ఆహారం లేదా నీటిని ఉంచడం వల్ల ఆహారంలో ప్లాస్టిక్ రసాయనాలు కలుస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అంతేకాకుండా ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడటం వల్ల అది విచ్ఛిన్నమై మైక్రోప్లాస్టిక్ కణాలు ఏర్పడి ఆహారం, నీటిలో చేరి మన శరీరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ లను ఎక్కువ కాలం వాడకూడదట. ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోతే అది వాతావరణంలో వ్యాప్తి చెందుతుంది. ఇది నీరు, గాలిలో కాలుష్యానికి కారణమవుతుంది. ఈ కాలుష్యం ఏదో విధంగా శరీరానికి చేరి ఆరోగ్యానికి అనేక సమస్యలకు కారణమవుతుంది. అలాగే ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ లు , బాటిళ్లు కాలక్రమేణా ఆహారం, నీటిలో వింత రుచులు, వాసనలను కలిగిస్తాయి. ఇది మీ ఆహారాన్ని పాడు చేస్తుంది.