Site icon HashtagU Telugu

Refrigerator: మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఇలాంటి పదార్థాలు పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Refrigerator

Refrigerator

ప్రస్తుతం రోజుల్లో దాదాపుగా అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ లో తప్పనిసరిగా ఉంటున్నాయి.. ఫ్రిడ్జ్ లేని ఇళ్ళులు దాదాపుగా ఉండవేమో అని చెప్పవచ్చు. చిన్న సైజు ఫ్రిడ్జ్ అయినా సరే మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఫ్రిడ్జ్ ఇంట్లో ఉంది అంటే చాలు ఆహార పదార్థాల నుంచి మసాలాపొడులు అలాగే ఊరగాయలు, కాయగూరలు పండ్లు అన్ని ఫ్రిజ్లో పెట్టేస్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో ధరలు అన్ని మండిపోతుండడంతో మళ్లీ మళ్లీ కొనుగోలు చేయలేక ఎక్కువ మొత్తంలో ఒకేసారి సరుకులు వంటివి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. అవి పాడైపోకుండా ఉండడం కోసం ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల వాటినే ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదని చెబుతున్నారు. మరి ఫ్రిజ్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తేనెలో నీటి శాతం తక్కువగా ఆమ్లతత్వం ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీనికి బ్యాక్టీరియాను నిరోధించే గుణం కూడా ఉంది, కాబట్టి ఫ్రిజ్‌ లో పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఒకవేళ ఫ్రిజ్​ లో పెడితే తేనె గట్టిగా మారిపోయి వాడుకోవడానికి అనువుగా ఉండదట. కాబట్టి నేను ఫ్రిజ్లో అసలు పెట్టకండి అని చెబుతున్నారు.

మామూలుగా మనం బయట నుంచి బ్రెడ్ తెచ్చినప్పుడు మెత్తగా ఉంటుంది. అయితే బయట ఉంటే చీమలు పడతాయని చాలామంది ఫ్రిజ్లో పెట్టేస్తూ ఉంటారు. దీనివల్ల మెత్తగా ఉన్న బ్రెడ్ కాస్త గట్టిగా అయిపోతూ ఉంటుంది. అలాకాకుండా ఉండేందుకు పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని చెబుతున్నారు. లేదంటే ఇప్పుడు వస్తున్న బ్రెడ్‌ స్టోరేజ్‌ బ్యాగుల్లో పెట్టినా సరిపోతుందట.

అలాగే టమోటాలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని అలా పెడితే వాటి లోపల సూక్ష్మంగా ఉండే ఒక పోషకాహార పొర పోతుందని చెబుతున్నారు. అందుకే ఇలా కాకుండా గాలి పొడిగా ఉండే ప్రదేశంలో ఉంచడం వల్ల సహజంగా ముగ్గి వండేటప్పుడు వాటి రుచి మరింత పెరుగుతుందట.

అరటి పండ్లను కూడా పొరపాటున ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఇలా చేస్తే తొక్క రంగు మారిపోవడమే కాకుండా పండ్లూ రుచిని కోల్పోతాయట. ఒక్కోసారి తినడానికి పనికిరాకుండా పోతాయని చెబుతున్నారు.

అలాగే కాఫీ గింజలను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదట. బంగాళదుంపలను కూడా ఫ్రిజ్లో అసలు పెట్టకూడదని ఫ్రిజ్‌లో పెడితే ఇందులోని స్టార్చ్‌ చక్కెరగా మారుతుందని చెబుతున్నారు. అలాగే ఉల్లి వెల్లుల్లి వంటివి కూడా ఫ్రిజ్లో అసలు పెట్టకూడదని చెబుతున్నారు.