Site icon HashtagU Telugu

Groundnut Oil: ఏంటి.. అప్పుడప్పుడు వేరుశనగ నూనె వాడటం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాల.. కానీ!

Groundnut Oil

Groundnut Oil

మామూలుగా మనం ఇంట్లో ఫ్రీడమ్ ఆయిల్ లేదా పామాయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క రకమైన నూనెను వాడుతూ ఉంటారు. కొందరు వేరుశనగ నూనె కూడా వాడుతూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే వేరు శనగ నూనె ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతర నూనెలతో పోలిస్తే వేరుశనగ నూనె రుచి కాస్త వేరుగా ఉంటుంది. అందుకే చాలామంది తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ వైద్యులు మాత్రం మిగతా నూనెల సంగతి పక్కన పెడితే ఎప్పుడో ఒకసారి అయినా వేరుశనగ నూనెతో వంటలు చేసుకొని తినాలని చెబుతున్నారు. ఈ నూనెతో కొన్ని వంటలు చేయడం చాలా మంచిదట.

ఈ నూనెలో ఎక్కువగా విటమిన్ ఇ ఉంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇందులో ఎక్కువగా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటితో పాటు కేలరీలు, ఫ్యాట్, శాచ్యురేటెడ్ ఫ్యాట్, విటమిన్ ఈ, మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, ఫైటోస్టెరాల్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట. ఈ నూనెని మితంగా తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ లాభాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. వేరుశనగన నూనెలోని మోనో‌అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయట. ఈ చెడు కొలెస్ట్రాల్‌ ని ధమనులని అడ్డుకుంటుంది. గుండె జబ్బులు, స్ట్రోక్‌ కి కారణమవుతుందట. అయితే ఈ నూనె తీసుకోవడం వల్ల సంతృప్త కొవ్వులకి బదులుగా పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్రావం కూడా మెరుగ్గా ఉంటుందట. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ లో ఉంచుతుందట.

కాగా వేరుశనగ నూనెలో మంచి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్‌ కి చాలా మంచిదట. వయసు పెరిగేకొద్దీ వచ్చే అనేక సమస్యల్ని ఈ వేరుశనగ నూనె దూరం చేస్తుందట. ఈ నూనెని తీసుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ టాక్సిన్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ వంటి వాటి నుంచి డ్యామేజ్ కాకుండా ఉంటాయట. దీంతో పాటు అల్జీమర్స్ వంటి సమస్యల్ని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. పల్లీ నూనెలో ఎక్కువగా విటమిన్ ఇ, మోనోశాచ్యురేటెడ్, పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయట. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిదట. పల్లీ నూనె తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. కాగా ఈ నూనెలో ఎక్కువగా విటమిన్ ఇ ఉంటుంది. ఇది బాడీని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుందట. దీని వల్ల సెల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయట. క్యాన్సర్స్, గుండె సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. పల్లీ నూనెలో ఎక్కువగా విటమిన్ ఇ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది.

దీని వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయట. అలాగే ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలు తగ్గుతాయట. అలాగే ఇందులో ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి. ఇవి స్కిన్‌ కి చాలా మంచిదట. ఇది స్కిన్‌ ని హైడ్రేట్‌ గా చేస్తుందట. అయతే పల్లీ నూనె మంచిదే అయినప్పటికీ దీనిని తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కొంతమందికి ఈ నూనె పడదు. అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముడి, కోల్డ్ ప్రెస్డ్‌ తో పోలిస్తే ప్రాసెస్డ్ పల్లీ నూనె కాస్తా బెటర్. అయినప్పటికీ ఏదైనా సమస్య అనిపిస్తే దీనిని తీసుకోకపోవడమే మంచిది. అదే విధంగా వేరు శనగ నూనెలో ఎక్కువగా ఒమేగా 6 ఫ్యాట్స్ ఉంటాయి. ఈ నూనెని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పెరిగే అవకాశం ఉందని అందుకే మితంగా తీసుకోవాలని చెబుతున్నారు.