Site icon HashtagU Telugu

Soaked Cloves: లవంగాలను నానబెట్టి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Soaked Cloves

Soaked Cloves

మసాలా దినుసుల్లో ఒకటైన లవంగాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని ఎన్నో రకాల వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలం నుంచి వీటిని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. వీటిలో విటమిన్ సి, విటమిన్ కె, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. లవంగాలను ఆహారం ద్వారే కాకుండా అలాగే కూడా తినవచ్చు. ముఖ్యంగా వీటిని నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. మరి లవంగాలు నానబెట్టి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి నానబెట్టిన లవంగాలు తింటే చాలా మంచిదని చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే నానబెట్టిన లవంగాలను తింటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి ఎన్నో జీర్ణ సమస్యలు తగ్గిపోతాయట. ఇది మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుందట. అలాగే లవంగాలు మీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయని చెబుతున్నారు. లవంగాలను నానబెట్టి తింటే మీ చర్మం 40 ఏళ్ళ వయసులో 20 వయసు వారిలాగ కనిపిస్తుందట. లవంగాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ముడతలు తొందరగా రాకుండా చేస్తాయట. లవంగాల్లో ఎన్నో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో సమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు.

ఇవి డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయట. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ప్రతి రోజూ పరిగడుపున నానబెట్టిన 2 లవంగాలను తినాలని, దీనివల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. లవంగాల్లో విటమిన్ సి, విటమిన్ కెలతో పాటుగా మాంగనీస్ కూడా మెండుగా ఉంటుంది. ఇవన్నీ మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి నానబెట్టిన లవంగాలన రెగ్యులర్ గా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. నానబెట్టిన లవంగాల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లో చెడు వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయట. అందుకే వీటిని తింటే నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుందని చెబుతున్నారు. నానబెట్టిన లవంగాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరం మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. నానబెట్టిన లవంగాలను తింటే కీళ్ల నొప్పి, మోకాళ్ల వాపు నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Exit mobile version