Site icon HashtagU Telugu

Coriander: పచ్చి కొత్తిమీర తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

Coriander

Coriander

కొత్తిమీర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.. కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్, మినరల్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా వరకు కొత్తిమీర ఉపయోగించి కొన్ని రకాలు వంటలు చేయడంతో పాటు ప్రతి ఒక్క వంటలు కొత్తిమీరను తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే కొందరు కొత్తిమీర ను ఇష్టంగా తింటే మరికొందరు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు.

కేవలం కూరలో వేసే కొత్తిమీర వల్ల మాత్రమే కాకుండా పచ్చికొత్తిమీర వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.. మరి పచ్చికొత్తిమీర వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. కొత్తిమీర జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు ఆహారంలో తప్పనిసరిగా పచ్చికొత్తిమీరను తీసుకోవాలని చెబుతున్నారు. పచ్చి కొత్తిమీరను మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయట. మలబద్ధకం సమస్య కూడా ఉండదని చెబుతున్నారు.

డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి కొత్తిమీర ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. రోజు కొంచెం పచ్చి కొత్తిమీర తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయట. అలాగే రక్తంలో ఇన్సులిన్ పరిమాణం కూడా నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది గుండెపోటుతో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుందట. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి పచ్చి కొత్తిమీర బాగా సహాయపడుతుందట. పచ్చి కొత్తిమీరలో ఉండే మూలకం కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి పచ్చి కొత్తిమీరతో పాటుగా ధనియా వాటర్ ను కూడా తాగావచ్చట. పచ్చికొత్తిమీర మన కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా బాగా సహాయపడుతుందట. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుందట. పచ్చి కొత్తిమీర తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయట. అలాగే కంటిచూపు కూడా బాగా పెరుగుతుందని చెబుతున్నారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా పచ్చి కొత్తిమీర తినడం వల్ల మూత్ర సమస్యలు తగ్గడంతో పాటు క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుందట. అలాగే మూత్రపిండాల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతున్నారు.