Site icon HashtagU Telugu

Jaggery: ప్రతిరోజు బెల్లం తింటే చాలు.. బరువు తగ్గడంతో పాటు ఆ సమస్యలన్నీ పరార్!

Jaggery

Jaggery

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. బెల్లాన్ని ఎన్నో రకాల స్వీట్లు తయారీలో వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, కాపర్, విటమిన్ సి, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ వంటి ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. బెల్లంని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలను పొందవచ్చు. అలాగే పలు రకాల అనారోగ్య సమస్యలకు సైతం చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. మరి ప్రతిరోజు బెల్లం తీసుకుంటే ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే..

మీరు కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ తో బాధపడుతుంటే మీరు బెల్లం తినడం మంచిది. ఎందుకంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు స్ట్రాంగ్, హెల్దీగా మారతాయి. బెల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలైన ఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దీంతో జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఎముకల్లో దృఢత్వం తగ్గుతుంది. రోజు గోరువెచ్చని పాలలో బెల్లం కలిపి తాగితే ఎముకలు గట్టిగా మారతాయని చెబుతున్నారు. బెల్లంలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బాడీలో ఎనర్జీని పెంచుతాయి. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలసట తగ్గుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు బెల్లం తినిపించడం అలవాటు చేయడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి,జింక్,సెలీనియం వారిలో ఇమ్యూనిటీని పెంచి బ్యాక్టీరియా వైరస్ ల కారణంగా వచ్చే సమస్యలను దూరం చేస్తుంది.

అలాగే బెల్లం తినడం వల్ల బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది. మీరు భోజనం చేశాక ఒక ముక్క బెల్లం తింటే త్వరగా జీర్ణమవుతుందట. అలాగే త్వరగా బరువు తగ్గుతారు. ఈజీగా బరువు తగ్గాలి అనుకున్న వారు ప్రతి రోజు ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ తగ్గితే అనీమియా ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ మన బాడీలో ఆక్సీజన్ సరఫరా చేస్తుంది. ఈ లెవల్స్ తగ్గడం వల్ల త్వరగా అలసిపోవడం, శ్వాస సమస్యలు, గుండె దడ, తలనొప్పి, నీరసం, చేతులు చల్లగా మారడం, చర్మం, పచ్చగా కనిపించడం జరుగుతుంది.

ఈ సమస్యలకి చెక్ పెట్టేందుకు బెల్లం తింటే అనీమియా నుంచి తప్పించుకోవచ్చు. దీనికి కారణం బెల్లంలో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉండడమే. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. అదే విధంగా, బెల్లం తినడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. దీంతో పాటు టాక్సిన్స్ కూడా తగ్గుతాయి. ప్రతి రోజు భోజనం చేశాక ఒక చిన్న ముక్క బెల్లం తింటే మన బాడీలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ యాక్టివ్ అవుతాయి. దీనికి కారణం బెల్లంలోని గొప్ప గుణాలు. దీంతో జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతే కాకుండా బెల్లంలోని మెగ్నీషియం, ఐరన్ లాంటి గుణాలు మెనుస్ట్రువల్ టైమ్‌ లో వచ్చే కడుపు నొప్పి, క్రాంప్స్‌ ని దూరం చేస్తాయట. నీరసం తగ్గి ఎనర్జీ వస్తుంది. కాబట్టి, పీరియడ్స్ టైమ్‌లో బెల్లం తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.