Black Tea: తేనె, నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో…

వాతావరణ కాలుష్యం, రసాయనాలతో పండించే పంటలు, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం ఇవన్నీ మనకు తెలియకుండానే రోజురోజుకూ కొత్త రోగాల్ని తెస్తున్నాయి.

  • Written By:
  • Updated On - May 5, 2023 / 05:00 PM IST

Black Tea: వాతావరణ కాలుష్యం, రసాయనాలతో పండించే పంటలు, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం ఇవన్నీ మనకు తెలియకుండానే రోజురోజుకూ కొత్త రోగాల్ని తెస్తున్నాయి. అందుకే ఆరోగ్య సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇందుకోసం జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. చిన్న పాటి వ్యాయామం, మంచి నిద్ర, మంచి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇవన్నీ ఉన్నా..చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిని చూసి ఆందోళనకు గురై డాక్టర్ వద్దకు పరుగెత్తడం కంటే ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వాటినే ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇవి మనకు తెలియకుండానే ఎంతగానో సహకరిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగించే వాటిలో బ్లాక్ టీ ఒకటి. ఇది ఆరోగ్యాన్ని చిటికెలో మెరుగుపరుస్తుంది. ఈ బ్లాక్ టీ కొద్దిగా నిమ్మరసం కలిపి ఖాళీ కడుపుతో తాగితే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చు.

* టాక్సిన్స్ ఔట్

శరీరంలో టాక్సిన్ పేరుకుపోతే తరచుగా ఆరోగ్యానికి హానికరం. రోజూ బ్లాక్ టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తేనెతో కూడిన బ్లాక్ టీ ప్రముఖ డిటాక్సిఫైయర్లలో ఒకటి. ఇది శరీరంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను తొలగిస్తుంది. తేనెతో పాటు కొద్దిగా నిమ్మరసం కూడా ఇందులో కలుపుకోవచ్చు. దీని ద్వారా మనం అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు.

* జీర్ణ సమస్యలకు చెక్

జీర్ణ సమస్యలు అనేక రకాలుగా ఆరోగ్యాన్నిదెబ్బతీస్తాయి. బ్లాక్ టీ జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు అన్ని జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. ఇది అన్ని రకాల కడుపు సమస్యలను నయం చేస్తుంది. అందుకు కొద్దిగా నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోంటు త్వరిత ఉపశనం కలిగిస్తుంది.

*రోగనిరోధక శక్తి అప్

తేనె మరియు నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగితే రోగనిరోధక శక్త పెరుగుతుంది . రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, శరీరంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు పెరుగుతాయి. కాబట్టి, అటువంటి సంక్షోభాలను నివారించడానికి కృషి చేయాలి. తరచుగా ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితులపై చాలా శ్రద్ధ ఉండాలి. కాబట్టి మీ దిన చర్యలో బ్లాక్ టీ ని తప్పనిసరిగా చేర్చుకోవాలి.

* జ్వరం, జలుబుకు..

శరీరంలో వ్యాధినిరోధక శక్తి
తగ్గినప్పుడు జ్వరం, జలుబు, అలసట, నీరసం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, ఒక గ్లాసు బ్లాక్ టీ ఈ పరిస్థితులను పరిష్కారం చూపగలదు. ఫ్లూ మరియు జలుబు నివారించాలంటే బ్లాక్ టీకి కొద్దిగా నిమ్మరసం చేర్చి తాగడం ఉత్తమం. బ్లాక్ టీ తాగితే జ్వరం మరియు జలుబుకు అద్భుతమైన నివారణ.

* యాంటీఆక్సిడెంట్లు పుష్కలం

నిమ్మరసం, తేనె కలిపి తీసుకునే బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ నిమ్మరసం తేనె కలిపిన బ్లాక్ టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. కాబట్టి దీన్ని అలవాటు చేసుకోవడం మంచిది.

*అధిక కొలెస్ట్రాల్ సమస్యకు సొల్యూషన్

అధికబరువు మరియు అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడే వారికి బ్లాక్ టీ మరియు నిమ్మరసం ఒక అద్భుత హోం రెమెడీ. స్థూలకాయానికి ఇక ఉత్తమమైన నివారణలలో ఒకటి. ఊబకాయం మరియు పొట్ట కొవ్వుకు తగ్గించడంలో ఉత్తమ పరిష్కారాలలో ఒకటి అనడంలో సందేహం లేదు. బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గించుకోవాలనే వారికి బ్లాక్ టీ, తేనె మరియు నిమ్మరసం మంచి మందు.కాబట్టి దీన్ని ఉదయం పరికడుపున తీసుకోండి.

* అలసట దూరం

అలసట అనేది అనేక అనారోగ్య సమస్యలకు ప్రారంభ సంకేతం. బ్లాక్ టీ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల అలసటను ఎదుర్కోగల శక్తిని అందించడంలో బ్లాక్ టీ అగ్రగామిగా ఉంది. మీకు అలసటగా అనిపించినప్పుడు వెంటనే ఒక కప్పు బ్లాక్ టీ తాగితే శరీరం మరియు మనస్సుకు శక్తినిస్తుంది.

* చర్మ క్యాన్సర్‌ను నయం చేసేందుకు..

క్యాన్సర్ లో వివిధ రకాలున్నా, అవి చర్మ క్యాన్సర్ విషయంలో, ఆరోగ్య సమస్యలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. అందువల్ల, బ్లాక్ టీ, తేనె మరియు నిమ్మరసం మిశ్రమం చర్మ క్యాన్సర్‌ను నయం చేయడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తాయి. కాబట్టి పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలు మీ ఆరోగ్యానికి చాలా సహాయకారిగా ఉంటాయి.