Site icon HashtagU Telugu

Dates: ప్రతిరోజు ఖర్జూరాలు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Dates

Dates

ఖర్జూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జురాలు తరచుగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే వైద్యులు వీటిని డైట్ లో చేర్చుకోవాలని చెబుతూ ఉంటారు. అయితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిన ఖర్జూరాన్ని ప్రతిరోజు తింటే ఏం జరుగుతుందో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ బి 6, కె వంటివి పుష్కలంగా ఉంటాయి.

కాగా ఖర్జూరంలోని పోషకాలు శక్తిని పెంచుతాయి. ఇందులోని గ్లూకోజ్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఉపవాసం ఉన్నవారు డేట్స్‌ ని తింటారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. అలాగే జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు వీటిని తినడం చాలా మంచిది. ఖర్జూరాలను తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. వీటిల్లో కేలరీలు తక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. అంతేకాకుండా ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయట.

ఈ సహజ తీపిని కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలో నెమ్మదిగా స్థిరంగా పెంచుతాయి. అలాగే ఇందులోని పీచు ఇతర పోషకాలు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఇది మొత్తం కేలరీలను తగ్గించి బరువు కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఖర్జూరాల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ పనితీరుకి హెల్ప్ చేస్తాయట. ఖర్జూరాల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకి ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి వీటిని రోజూ తినడం చాలా మంచిదని చెబుతున్నారు.