చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా పాలు తాగుతూ ఉంటారు. కొంతమంది ఆవు పాలు తాగితే మరికొందరు గేదె పాలు తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది పాలకు బదులుగా కాఫీ టీ వంటివి తాగుతూ ఉంటారు. పాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం ఎముకలకు గట్టితనాన్ని ఇస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి పాలు ఎంతో బాగా పనిచేస్తాయి.
అయితే ఇప్పుడు తాగినా సరే పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వేసవికాలం. ఈ సమయంలో వేడి పాలకు బదులుగా చాలా పాలు తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. మరి వేసవిలో చల్లని పాలు తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండే పాలు చల్లారిన తర్వాత తాగితే ఛాతీ, కడుపు నొప్పి, హైబీపీ, నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
ఎండా కాలంలో చాలా మంది గుండెల్లో మంట, కడుపు చికాకు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితిలో కాల్షియం పుష్కలంగా ఉండే పాలు అదనపు ఆమ్లాన్ని గ్రహించడంలో, ఆమ్లం ఏర్పడకుండా నిరోధించడంలో చాలా ఎఫెక్టీవ్ గా సహాయపడుతుందట. అందుకే మీరు కూడా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే చల్లటి పాలను తాగాలని చెబుతున్నారు. ఇది యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కలిగే చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుందట. చల్లని పాలను తాగడం వల్ల మీకు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర వస్తుందట.
చల్ల పాలను తాగడం వల్ల బీపీలో హెచ్చు తగ్గుల సమస్య ఉండదట. దీంతో మీ శరీరం రిలాక్స్ అవుతుందట. అంతేకాదు రోజంతా ఉల్లాసంగా ఉంటారట. చల్ల పాలు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుందట. హైబీపీని నియంత్రించడంలో చల్లని పాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. ఈ పాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయట. అలాగే శరీరంలో ఒత్తిడి హార్మోన్లను కూడా తగ్గిస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు చల్లని పాలనే తాగాలని నిపుణులు చెబుతున్నారు.