Ajwain Water : ప్రతిరోజు వాము నీళ్ళు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..

వాముని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా కడుపునొప్పి కడుపులో మంట, అజీర్తి ఇలా ఎన్నో సమస్యలకు వాము (Ajwain Water) ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

  • Written By:
  • Updated On - January 10, 2024 / 04:40 PM IST

Benefits of Drinking Ajwain Water Everyday : వాము వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వాముని ఎన్నో రకాల ఆహార పదార్థాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాముని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా కడుపునొప్పి కడుపులో మంట, అజీర్తి ఇలా ఎన్నో సమస్యలకు వాము (Ajwain Water) ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గించుకోవడానికి వాము (Ajwain Water) బాగా సహాయపడుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

అందుకే దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి వాము నీటిని తాగడం వలన పొట్ట నడుము కొవ్వు తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయం ఏమీ తినకుండా వాము వాటర్ తాగితే ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు. వాము నీటిని కొద్దిగా వేడి చేసిన తర్వాత కూడా త్రాగవచ్చు. అలాగే బరువు తగ్గడానికి 25 గ్రాములు వాము గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచి ఫలితం ఉంటుంది.

ఇలా నెల రోజులు పాటు వాము వాటర్ తాగితే శరీరంలో తేడా వస్తుంది. ఒకవేళ వాము గింజలను రాత్రి నీటిలో నానబెట్టడం మర్చిపోతే ఉదయాన్నే ఒక స్పూన్ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి మరగబెట్టాలి. ఇప్పుడు అందులో ఐదు ఆరు తులసి ఆకులను వేయాలి. ఆ తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే మంచి ఫలితం లభిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. తిన్న ఆహారం జీర్ణం అవ్వలేదు అనేవారు కూడా వాముని తినడం వల్ల తిన్న ఆహారం కూడా జీర్ణమవుతుంది.

Also Read:  Special Offer: రూ. 1799కే విమానంలో ప్రయాణించే ఛాన్స్.. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన ఎయిర్‌లైన్స్..!