Blood Donation: రక్త గ్రూపులు పాజిటివ్, నెగిటివ్‌గా ఉంటాయి. ఉదాహరణకు A, B, AB, O. ఈ గ్రూపులలోని ఆరోగ్యవంతమైన వ్యక్తులందరూ రక్త దానం చేయగలరు. కానీ, రక్త దానం (Blood Donation) చేసిన తర్వాత శరీరం అదే మొత్తంలో రక్తాన్ని తిరిగి తయారు చేయడానికి ఎంత సమయం పడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్టాన్‌ఫోర్డ్ బ్లడ్ సెంటర్ నివేదిక ప్రకారం.. రక్త దానం చేసిన తర్వాత శరీరం వెంటనే ఎర్ర రక్త కణాలను తిరిగి పొందే ప్రక్రియను ప్రారంభిస్తుంది. కొన్ని రక్త భాగాలు కొన్ని గంటలు లేదా రోజుల్లో పునరుద్ధరణ అవుతాయి. అయితే మరికొన్నింటికి ఎక్కువ సమయం పడుతుంది.
ప్లాస్మా: రక్త దానం తర్వాత శరీరంలో ప్లాస్మా 24 నుండి 48 గంటల్లో పునర్జననం అవుతుంది.
ఎర్ర రక్త కణాలు (RBC): ఎర్ర రక్త కణాలను పూర్తిగా మార్చడానికి సాధారణంగా 4 నుండి 8 వారాల సమయం పడుతుంది.
ఐరన్: రక్తంలో ఐరన్ స్థాయి సాధారణ స్థితికి చేరడానికి 8 వారాల వరకు సమయం పట్టవచ్చు.
రక్త దానం తర్వాత శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ఎలా?
- నీరు, ద్రవ పదార్థాల సేవనాన్ని పెంచండి.
- ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. ఇందులో ఆకుపచ్చని ఆకు కూరలు, నారింజ పండ్లు, పప్పులు, గింజలు ఉంటాయి.
- రక్త దానం తర్వాత 24 గంటల పాటు తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం.
Also Read: MK Stalin : స్టాలిన్ పోస్ట్‌పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం
రక్తాన్ని ఎన్ని సార్లు దానం చేయవచ్చు?
భారతదేశంలోని ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం.. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చు. పురుషులకు 12 వారాలు, మహిళలకు 16 వారాలలో రక్త దానం చేయడం సురక్షితంగా పరిగణించబడుతుంది.
రక్త దానం వల్ల కలిగే ప్రయోజనాలు
- రక్త దానం చేయడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
- రక్త దానం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ధమనుల అడ్డంకులను తగ్గిస్తుంది.
- రక్త దానం ఐరన్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది.
- రక్త దానం చేయడం వల్ల సంభావ్య ఆరోగ్య సమస్యలు గుర్తించబడతాయి.
- రక్త దానం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- రక్త దానం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
- రక్త దానం కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.
- రక్త దానం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- రక్త దానం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- రక్త దానం ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతికూల భావనలను దూరం చేస్తుంది.