Site icon HashtagU Telugu

Ugadi Pachadi: వామ్మో.. ఉగాది రోజు చేసే ఉగాది పచ్చడి వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?

Ugadi Pachadi

Ugadi Pachadi

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఉగాది పండుగ కూడా ఒకటి. ఈ ఉగాది పండుగ రోజున షడ్రుచులను కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తూ ఉంటారు. ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, కారం, ఉప్పు, వగరు,చేదు అనే ఆరు రుచులు కలుస్తాయి. ఆరు రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి తాగడం తినేందుకు రుచిగానే కాదు, సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేసవికాలం ప్రారంభంలో ఈ ఉగాది పండుగ వస్తుంది,కాబట్టి ఈ సమయంలో ఈ ఉగాది పచ్చడి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయట. మరి ఉగాది పచ్చడి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..

శీతాకాలం నుంచి వేసవి కాలం ప్రారంభంలో ఉగాది పండుగ వస్తుంది. ఈ సమయంలో అనేక ఆరోగ్య ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటి నుంచి కాపాడుకునేందుక పూర్వ కాలంలో ఉగాది పచ్చడిని తయారు చేశారని కొందరు చెబుతుంటారు. ఇందులో ఉన్న ఆరు రకాల పదార్థాలు ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటుందట. ఉగాది పచ్చడిలో బెల్లం, వేప పువ్వు కలిపి వేస్తుంటారు. ఈ రెండు మిశ్రమాల వల్ల శరీరంలో ఉండే టాక్సిన్‌ లు బయటికి వెళ్లిపోతాయట. వేప పువ్వులు ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి హానికరమైన టాక్సిన్స్ లను తొలగిస్తాయని చెబుతున్నారు. ఈ వేప పువ్వు, బెల్లం కలిపిన మిశ్రమం తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉందట. కొవ్వును సులభంగా కరిగిస్తుందట.

గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారికి ఉగాది పచ్చడి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. కాగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర నిల్వలను సమతుల్యం చేస్తాయట. అలాగే చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల వడ దెబ్బ తగిలే సమస్య నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు. ఉగాది పచ్చడిలో కొత్త మామిడి ముక్కలు వేస్తారు. వడదెబ్బను నివారించడంలో సహాయపడుతుందట. దీన్ని తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుందని, ఇవే కాకుండా అజీర్ణం, డీ హైడ్రేషన్‌ వంటి పలు అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉగాది పచ్చడి కాపాడుతుందని చెబుతున్నారు.