Tulsi: ఆయుర్వేదంలో తులసి ఆకులను వాటి ఔషధ గుణాల కోసం బాగా గుర్తిస్తారు. వైద్య పరిభాషలో తులసి (Tulsi) ఆకులను ఆసిమమ్ శాంక్టమ్ అని అంటారు. ఇందులో ఉండే రక్షిత గుణాలు విషపూరిత కణాల నుండి రక్షిస్తాయి. ఎండోసల్ఫాన్, లిండెన్, క్లోర్‌పైరిఫాస్ వంటి పురుగుమందులతో పోరాడుతాయి. తులసి యాంటీ-ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తుంది. ప్రతిరోజూ తులసి ఆకులు (Tulsi Leaves) తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు? దానిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
తులసి ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
శ్వాసకోశ సమస్యలు: తులసి తీసుకోవడం వలన శ్వాస సంబంధిత సమస్యలు (ఉదాహరణకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది), గొంతు నొప్పి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. 4 నుండి 5 తులసి ఆకులను ఒక గ్లాసు నీటిలో తేనె, అల్లం కలిపి తాగితే దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణ: తులసి తీసుకోవడం వలన హై కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది. దీనితో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
తలనొప్పి: ఒత్తిడి, తలనొప్పిని తగ్గించడానికి తులసిని తీసుకోవచ్చు. తులసి తినడం వలన తలనొప్పి తగ్గుతుంది.
నోటి ఇన్ఫెక్షన్లు: నోటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే తులసిని ఉపయోగించవచ్చు. తులసి నోటిలో వచ్చే పొక్కుల (Oral Ulcers) నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read: Global Summit: గ్లోబల్ సమ్మిట్.. తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఎంతంటే?!
కిడ్నీలో రాళ్లు: తులసి సేవనం ద్వారా మూత్రపిండాలలో రాళ్ల సమస్యను తగ్గించుకోవచ్చు. తులసి నీరు మూత్రపిండాల సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
దంత సమస్యలు: తులసి ఆకులను నమలడం లేదా తులసి ఆకులను ఆరబెట్టి పొడి చేసి దంతాలపై రుద్దడం వలన దంతాలు శుభ్రపడి, మెరుస్తాయి.
ప్రతిరోజూ తులసి ఆకులు తింటే ఏం జరుగుతుంది?
ప్రతిరోజూ తులసి ఆకులు తినడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీంతోపాటు ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది. తులసి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. అలాగే ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. తులసి ఆకులు రోజూ తినడం వలన రక్తపోటు వంటి సమస్యలు దూరమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
తులసిని ఎలా తీసుకోవాలి?
- తులసి ఆకులను నేరుగా నమలవచ్చు.
- తులసిని నీటిలో మరిగించి తులసి నీటిని తాగవచ్చు.
- తులసి ఆకులను పేస్ట్ చేసి రసం తీసి ఆ రసాన్ని తాగవచ్చు.
- తులసి టీ చేసుకుని కూడా తాగవచ్చు. తులసి టీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
